హిందూ ధర్మంపై జరుగుతున్న కుట్రలను అరికట్టాలన్నారు శ్రీ పీఠం అధిపతి, రాష్ట్రీయ హిందూ సేవ వ్యవస్ధాపక అధ్యక్షుడు స్వామిపరిపూర్ణానంద. ఈసందర్భంగా మూడు రోజుల పాటు తాను యాత్రను చేపట్టనున్నట్లు తెలిపారు. హిందూ కొందరు వ్యక్తులు కావాలని హిందూ దేవుళ్లను దూషిస్తున్నారన్నారు. వాళ్ల సొంత పబ్లిసిటి కోసం దేవుడిని వాడుకోవడం మంచి పద్దతి కాదని తెలిపారు. రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కత్తి మహేశ్ పై స్వామి పరిపూర్ణానంద మండిపడ్డారు.
హిందూ ధర్మంపై జరుగుతోన్న దాడులకు నిరసనగా రేపటి నుంచి మూడు రోజులు తాను యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా ఆయన నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి యాత్రకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. హీందూ ధర్మంపై జరుగుతున్న కుట్రలను, మేధావుల ముసుగులో విచ్చిన్నకర శక్తులను ఇంకెన్నాళ్లూ భరించాలన్నారు.
హిందూ ధర్మంపై జరుగుతున్న కుట్రలను అడ్డుకోవడానికే ఈయాత్రను చేపట్టనునట్టు వివరించారు. హైదరాబద్ లోని బోడుప్పల్ నుంచి యాదగిరిగుట్ట వరకూ ఈయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. జులై9వ తేది సోమవారం మధ్యాహ్నం 12గంటలకు అంబేద్కర విగ్రహానికి నివాళులు అర్పించి మధ్యాహ్నం 2 గంటల నుంచి యాత్ర ప్రారంభించనున్నారు.