కడియం శ్రీహరికి బర్త్‌డే విషెస్ తెలిపిన సీఎం కేసీఆర్..

251
CM KCR birthday wishes to Deputy CM Kadiyam Srihari
- Advertisement -

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి జన్మదిన సందర్భంగా గవర్నర్ నరసింహ్మన్, ముఖ్యమంత్రి కేసిఆర్ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కడియం శ్రీహరి పూర్తి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని పుట్టిన రోజు శుభాకాంక్షల్లో పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నివాసానికి ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ, ఎంపీ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యే అరూరి రమేష్, కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

CM KCR birthday wishes to Deputy CM Kadiyam Srihari

వీరితో పాటు.. టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెలపల్లి రవీందర్ రావు, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, వికలాంగుల కార్పోరేషన్ వాసుదేవరెడ్డి, వరంగల్ డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, వరంగల్ టిఆర్ఎస్ పార్టీ నేతలు నాగుర్ల వెంకన్న, భరత్ కుమార్ రెడ్డి, పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇంటర్ జేఏసీ మధుసూధన్ రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నేతలు, విద్యాశాఖ అధికారులు వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

CM KCR birthday wishes to Deputy CM Kadiyam Srihari

CM KCR birthday wishes to Deputy CM Kadiyam Srihari

- Advertisement -