సోనాలి అధైర్య పడకు.. క్యాన్సర్ ను ఓడించు

351
sonali-bendre
- Advertisement -

ఆ హీరోయిన్‌ వాలు క‌నులతో అంద‌రినీ త‌న‌వైపు తిప్పుకుంది.. బంగారు క‌ళ్ల బుచ్చెమ్మ అంటూ త‌న వెంట న‌డిపించుకుంది… చిరంజీవి సరసన ఇంద్ర, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌,  మ‌హేశ్ బాబు సరసన మురారి, నాగార్జున సరసన మన్మధుడు  వంటి చిత్రాలలో నటించి వారితో చిందేసింది ఆ ముద్దుగుమ్మ.. 1990-2000 దశకంలో ఇటు టాలీవుడ్‌లో, అటు బాలీవుడ్‌లో పలువురు అగ్రహీరోలతో నటించి తన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న ఈ హీరోయిన్‌ ఇప్పుడు ప్రాణాంతక మహామ్మారితో పోరాడుతోంది.

Sonali-cancer

ఎవరి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. తాను ఇప్పుడు ప్రాణాంతకమైన క్యాన్సర్‌ వ్యాధి భారిన పడి చావుతో పోరాటం చేస్తున్నానని ఇటీవలే పేర్కొంది సోనాలి. ఇన్ స్టా గ్రాం వేదిక‌గా త‌న అభిప్రాయాల‌ను పంచుకున్న సోనాలి ఈ క్లిష్ట స‌మ‌యంలో  పోరాట‌మే శ‌ర‌ణ్యం అని చెబుతోంది. సానుకూల‌త‌తోనే ఈ స‌వాలును సునాయాసంగా దాట‌గ‌ల‌న‌ని, ఇప్పుడున్న మార్గంలో అడుగడుగునా పోరాడాలి అని ఆమె త‌న మ‌నోగ‌తం వెల్ల‌డించింది.

nagarjuna-sonali

అయితే క్యాన్సర్‌ బారిన పడి చికిత్స తీసుకుంటున్న సోనాలికి పలువురు సెలెబ్రిటీలు ధైర్యం చెబుతున్నారు. ఆమె త్వరగా కోలువాలని, క్లిష్టపరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు. టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున ట్వీట్టర్‌లో సోనాలి త్వరగా కోలువాలని ట్వీట్ చేయగా, రితేష్ దేశముఖ్ కూడా ఈ వార్త విన్నవెంటనే చాలా కృంగిపోయానని సోనాలి త్వరలో కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తానని పేర్కొన్నారు. అటు వివేక్‌ ఒబెరాయ్‌ కూడా సోనాలి త్వరగా కోలువాలని, ఎప్పటికైనా సోనాలి చేతిలో క్యాన్సర్‌ ఓడిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ బాధాతప్త హృదయంతో ట్వీట్‌ చేశారు. సోనాలి అధైర్య పడకు.. ఆ ప్రాణాంతక మహామ్మారిని ఎప్పటికైనా ఓడించు అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. మొత్తానికి హీరోయిన్‌ గా ఓ వెలుగు వెలిగి తనదైన ముద్రవేసుకున్న సోనాలి ఇప్పుడు సోనాలి వ్యాధి బారిన పడిన విషయం ప్రతి ఒక్కరిని కలిచి వేస్తోంది. ఆమె త్వరగా కోలువాలని మనమూ కోరుకుందాం.

nagarjuna

- Advertisement -