ట్యాటూ వెనకున్న టాప్ సీక్రెట్ చెప్పిన సామ్‌..

240
- Advertisement -

సమంత తెలుగు,తమిళ్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. పెళ్లైనా అదే క్రేజ్‌ని కంటిన్యూ చేస్తూ స్టార్ హీరోలతో జోడీ కడుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉండగానే అక్కినేని ఫ్యామిలీలో కోడలిగా అడుగుపెట్టింది. సామ్‌ సామాజిక మాధ్యమాల్లో చాలా చురుగా ఉంటుంది. సామాజిక అంశాల మీద ఆమె స్పందించే తీరు.. మీడియాను డీల్ చేసే పద్దతి మిగిలిన వారి కంటే భిన్నంగా ఉంటాయని చెప్పాలి. సూటిగా.. స్పష్టంగా ఉండే సమంత.. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ సందర్భంగా పలు అంశాల్ని చెప్పుకొచ్చారు.

Samantha

చైతన్య చేతికి మీ చేతికి ఉండే ఒకేలాంటి ట్యాటూ అర్థం ఏమిటి? ఆ గుర్తుకు ఏదైనా సెంటిమెంట్ ఉందా? అన్న ప్రశ్నకు సమంత అసలు విషయాన్ని బయటపెట్టేసింది. రోమన్ భాషలో ఉండే ఈ బాణాల గుర్తుకు ‘‘వాస్తవంలో ఉండండి, మీలా మీరు ఉండండి’’ అని అర్థం అని సామ్ తెలిపింది. అందుకే తమ చేతిపై ఈ టాటూ వేయించుకున్నాం అని స్వయంగా సమంతాయే ఈ టాటూ సీక్రెట్‌ని రివీల్ చేసింది. ఆన్ స్క్రీన్ లో తామిద్దరం ఆర్టిస్టులమని.. ఆఫ్ స్క్రీన్ లో వాస్తవంలో బతకాలన్నది తమ ఇద్దరి ఆలోచనగా ఆమె చెప్పారు. అంతేకాదు నాగచైతన్య కూడా ఇలాగే ఆలోచిస్తాడట. అందుకే ఈ జంట తమ చేతిపై ‘బాణాలను’ టాటూగా వేయించుకున్నారట.

- Advertisement -