మహారాష్ట్రలోని గోదావరిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు కేంద్ర జలవనరుల శాఖ అధికారులు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు 14గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈరోజు ఉదయం కేంద్ర జలసంఘం అధికారుల ఆధ్వర్యంలో 14గేట్లను ఎత్తారు అధికారులు. ఈకార్యక్రమంలో మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు కూడా పాల్గోన్నారు. ఉదయం నీళ్లును విడిచిపెట్టడంతో సాయంత్రం వరకూ గోదావరి జలాలు బాసరకు చేరుకున్నాయి.
బాసరకు నీరు చేరకొవడంతో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్టు వద్ద గోదావరి లో నిల్వ ఉన్న 0.56టీఎంసీల నీరు దిగువ గోదావరికి ప్రవహిస్తుంది.సోమవారం ఉదయం వరకూ ఈనీరు నేరుగా శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి ఈనీరు చేరనుంది. దింతో శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ 2 టీఎంసీలకు పెరుగనుంది.
జులై 1 నుంచి అక్టోబర్ 28వ తేది వరకూ బాబ్లీ గేట్లు తెరచి ఉంటాయి. మొత్తం 120రోజులు బాబ్లి ప్రాజెక్టు నుంచి తెలంగాణకు నీళ్లను వదలనున్నారు. ప్రతి ఏటా జూన్ 30వ తేదిన అర్ధరాత్రి నుంచి బాబ్లీప్రాజెక్ట్ గేట్టు ఎత్తి దిగువన ఉన్న ఎస్సారెస్పీ ప్రాజెక్టు వదలాలని..తిరిగి మళ్లి అక్టోబర్ నెలలో గేట్లు మూసేయాలని 2013లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.