- Advertisement -
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు కమ్ముల బాలసుబ్బారావు ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు వయసు 83 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏలూరులోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఎమ్మెల్సీగా, డీబీసీసీ చైర్మన్ గా కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం సేవలందించిన బాల సుబ్బారావు, మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహరావుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలతో నమ్మకంగా వ్యవహరించారు. ఆయన మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు కుటుంబ సభ్యులు సంతాపం తెలిపారు.
- Advertisement -