ఫోన్ మాట్లాడుతుందని కూతురుని కడతేర్చిన తండ్రి…

219
chandrika-andhra-pradesh
- Advertisement -

శుక్రవారం పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. శనివారం కన్న తండ్రి మూర్ఖత్వానికి బలైపోయింది. కూతురు ఓ యువకుడితో ఫోన్ మాట్లాడుతుందని, ఆవేశంతో కూతురినే కడతేర్చాడు కసాయి తండ్రి. కూతురు ఓ యువకుడితో ప్రేమలో ఉందన్న అనుమానంతో కర్రతో కొట్టి చంపాడు తండ్రి. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం తోటరావుపాడు గ్రామంలో తొండిపు కోటయ్య, పద్మావతి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. కోటయ్య వ్యవసాయం చేస్తుండగా.. ఆయన భార్య పద్మావతి కూలీపనులు చేస్తూ ఇద్దరు కుమార్తెలను చదివిస్తున్నారు.

Father Kills Daughter

పెద్దకుమార్తె చంద్రిక(22) ఈ మధ్యే బీమార్మసీ పూర్తి చేసుకుంది. అయితే శనివారం రోజు చంద్రిక ఫోన్ మాట్లాడుతుండగా గమనించిన కోటయ్య, ఆవేశంతో కూతురిని కర్రతో బలంగా కొట్టాడు. తలపై బలంగా తాకడంతో చంద్రిక అక్కడే ప్రాణాలు వదిలింది. కూతురు చనిపోయిందని గమనించిన కోటయ్య ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఇక కన్న కూతురు కళ్లముందే చనిపోవడంతో చంద్రిక తల్లి సృహకోల్పోయి పడిపోయింది.

చంద్రిక తాత పారా రామారావు మాత్రం కోటయ్యపై ఫిర్యాదు చేశాడు. చంద్రిక ఓ యువకుడిని ప్రేమించానని, ఆ యువకుడినే పెళ్లి చేసుకుంటానని తండ్రితో చెప్పినందుకే, ఆవేశంతో కొట్టి చంపాడని రామారావు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

- Advertisement -