ప్రకాశ్‌ రాజ్‌ని చంపేందుకు కుట్ర..!

254
Prakash Raj
- Advertisement -

జ‌స్ట్ ఆస్కింగ్‌ అంటూ విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ ట్విట‌ర్ వేదిక‌గా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఆ పార్టీ విధానాలను ఎండగడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన స్నేహితురాలు,జర్నలిస్ట్ గౌరీ లంకేష్‌ను చంపిన దుండగులు ప్రకాష్ రాజ్‌ని చంపేందుకు కుట్ర పన్నారు. పోలీసు విచారణలో వెలుగు చూసిన ఈ విషయం ఇప్పుడు కన్నడనాట హాట్ టాపిక్‌గా మారింది.

ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఇకపై తన గళం మరింత పెరుగుతందని ట్వీట్టర్‌లో ట్వీట్ చేశారు. మీరు పిరికివాళ్లు…విద్వేషపూరితమైన రాజకీయాలే మీ విధానామా అని ప్రశ్నించారు.

ఇదిఇలా ఉండగా కర్నాటకలో జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యకేసు పెనుసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె హత్య కేసులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని..కేసు దర్యాప్తు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గౌరీ లంకేష్ హత్యకేసును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ప్రకాశ్ రాజ్‌ను కూడా హత్యచేయాలని ప్లాన్ వేసినట్లు తెలిపింది.

- Advertisement -