ఆకట్టుకుంటున్న నయనతార మూవీ ట్రైలర్..

368
nayanthara-Imaikkaa-Nodigal
- Advertisement -

తన అందంతోనే కాకుండా, నటనతోనూ అందరిని ఆకట్టకుంటుంది హోరోయిన్ నయనతార. ప్రతి సినిమాలో కొత్త ధనాన్ని పరిచయం చేస్తుంది. అందుకే ఆమెకు ఇంకా క్రేజ్ తగ్గలేదని చెప్పొచ్చు. ఆమె కథను ఎంచుకునే విధానాన్ని, ఆమె తోటి నటులే మెచ్చుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘డిమోంటే కాలని’ ఫేమ్ దర్శకుడు జ్ఞానముత్తు దర్శకత్వంలో ‘ఇమైక్కా నోడిగల్’ అనే సినిమాలో నటిస్తోంది.

Vijay-Sethupathi-will-pair-up-with-Nayanthara-again-in-Imaikkaa-Nodigal

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ అండ్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. వరుస హత్యలతో సైకో భయపెడుతుంటే, అతని కోసం అన్వేషించే ఆఫీసర్ పాత్రలో నయనతార అదరగొట్టేస్తోంది. ఇక లవర్స్ గా అధ్వర, రాశీఖన్నా కనిపించారు. ఇక మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నయనతార భర్తగా కొద్ది క్షణాలు కనిపించనున్నారని దర్శకుడు తెలిపాడు. ఈ ఇద్దరిపై ఓ సాంగ్ కూడా చిత్రీకరించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాతో నయన మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి ఇక.

మరోవైపు ఈ అమ్మడు, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో గతకాలంగా ప్రేమాయణం నడిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రియుడు విఘ్నేశ్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియెంటల్ సినిమా చేయనున్నట్లు సమాచారం. తన లవర్ కోసం, ఈ సినిమాకు నిర్మాతగా మారునున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

- Advertisement -