కూలీ డబ్బులతో.. పుస్తకాలు కొన్నా-గెటప్ శ్రీను

569
getupsrinu
- Advertisement -

జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి.. జబర్దస్త్ కామెడీ షోలోకి ఎంటరై.. తన గెటప్ లతో గెటప్ శ్రీనుగా ఎదిగారు. ఆ షోతో మంచి గుర్తింపు ఏర్పర్చుకున్నారు. తాజాగా ఆయన జబర్దస్త్ తో సహా.. మరికొన్ని టీవీ షో లు చేస్తున్నారు. మరోవైపు సినిమా అవకాశాలతో బిజీగా ఉన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీను, చిత్ర పరిశ్రమకు రాక ముందు తాను ఎదుర్కొన్న సమస్యల గురించి ప్రస్తావించారు.

Jabardasth-Srinu

మా అక్క పెళ్లి కావడంతో అప్పులు ఎక్కువై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఆ సమయంలో తాను గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ హాస్టల్లో ఉండేవాడినని.. ఆ సమయంలో పుస్తకాలకు, ఖర్చులకు డబ్బులు ఉండేవికావని అన్నారు. వేసవి సెలవులు వస్తే పిల్లలందరూ ఇంటికి వెళ్లే వారని, తాను మాత్రం వేసవి సెలవులు వచ్చాయంటే చెరకు బండి దగ్గర పనిచేసేవాడినని చెప్పారు. వాళ్లు పుస్తకాలు కొనిచ్చి, కొంత డబ్బులు ఇచ్చేవారని, వాటిని మా అమ్మకు ఇచ్చేవాడినని అన్నారు.

స్కూల్ రోజులలోనూ ప్రతి ఆదివారం కూలీ పనులు చేసేవాడినని, నాట్లువేయడం, కుప్పనూర్చడం వంటి పనులు చేశానని అన్నారు. అలా వచ్చిన రూ.50లతో పుస్తకాలు కొనుకునేవాడిని అంటూ చెప్పుకొచ్చారు.

- Advertisement -