ప్రభుత్వ విధానాలు,ప్రజల చిత్తశుద్దితో తెలంగాణ ఆర్ధిక ప్రగతి సాధించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ స్థిరమైన ఆర్థికాభివృద్ధిని సాధిస్తూ దేశంలో అగ్రభాగాన నిలవడంపై హర్షం వ్యక్తం చేసిన సీఎం..పెద్దనోట్ల రద్దు,డిమానిటైజేషన్,జీఎస్టీ వంటి నిర్ణయాలు దేశ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపినప్పటికి తెలంగాణ సుస్థిరమైన వృద్దిరేటుతో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ప్రజలు పన్నుల చెల్లింపులో ప్రదర్శిస్తున్న చిత్తశుద్ది ఆర్థిక వృద్ధిలో అగ్రపథాన నిలిపిందన్నారు.
రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి నాలుగేండ్లలోనే సగటున 17.2 వృద్ధిరేటును సాధించింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంచేశాయి. స్టేట్ ఓన్ టాక్స్ (ఎస్వోటీ) రెవెన్యూలో దేశంలోని మిగతా 28 రాష్ర్టాల కంటే తెలంగాణ ముందున్నది. 17.2 శాతం వృద్ధిరేటుతో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా హర్యానా (14.2శాతం), మహారాష్ట్ర (13.9శాతం), ఒడిశా (12.4 శాతం) పశ్చిమ బెంగాల్ (10.3శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
2014 నుంచి 2018 వరకూ వివరాలను కాగ్ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం 2015-16 ఆర్థిక సంవత్సరంలో 13.7 శాతం, 2016-17లో 21.1, 2017-18లో 16.8 శాతం వృద్ధిరేటు సాధించిందని తెలిపింది.