కూలీ ఇంట్లో వందకుపైగా కోబ్రాలు.. వీడియో…

349
King-Cobra
- Advertisement -

సాధారణంగా మనం ఒక చిన్న పామును చూస్తూనే హడలిపోతాం. ఆ కనిపించిన ప్రదేశంలోకి వెళ్లకుండా.. దూరంగా వెళ్తుంటాం. అలాంటిది ఓ వ్యక్తి ఇంట్లో ఏకంగా వందకు పైగా నాగు పాములు కనిపించాయి. ఈ పాములను చూసిన ఆ కుటుంబం హడలిపోయింది. ఈ ఘటన ఒరిస్సా లో జరిగింది.

111 cobra babies

వివరాల్లోకి వెళ్తే ఒరిస్సాలోని భద్రక్ జిల్లా శ్యామ్ పూర్ అనే గ్రామంలో బిజయ్ అనే కూలి చేసే వ్యక్తి ఈ మధ్య ఓ ఇల్లు నిర్మించుకున్నాడు. శుక్రవారం తన కూతురు ఒక పాము పిల్లను చూసి భయంతో బిజయ్ వద్దకు పరుగులు తీసింది. ఆ పాము పిల్ల తన గది మూల నుంచి రావడం గమనించిన బిజయ్… ఆ గదిని క్షుణంగా పరిశీలించాడు. గదిలోని ఓ మూలన ఉన్న పుట్టలో పదులో సంఖ్యలో పాములు కనిపించడంతో భయంతో వెంటనే స్నేక్ హెల్స్ లైన్ కు ఫోన్ చేసి సమాచారం అందించాడు.

ఎంతో శ్రమించి బిజయ్ ఇంట్లోని పుట్టను తవ్వి చూడగా.. ఏకంగా వందకు పైగా కోబ్రా పిల్లలు కనిపించాయి. ఆ పిల్లలతో పాటు మరో 21 గుడ్లు కూడా లభించాయి. అయితే ఆ పుట్టలో తల్లి పాము మాత్రం కనిపించలేదు. ఇక ఆ ఇంట్లో ఉండాలంటే భయంగా ఉందన్నాడు బిజయ్. ఒరిస్పాలో గత మూడు సంవత్సరాల వ్యవధిలోనే 1700 మంది పాము కాటుతో చనిపోయారంటే.. ఆ రాష్ట్రంలో పాము కాటు మరణాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -