జయశంకర్ సార్..సేవలు మరువలేనివి:కేటీఆర్

259
ktr telangana bhavan
- Advertisement -

తెలంగాణ ఉద్యమ జ్యోతి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఆచార్య జయశంకర్ సార్ 7వ వర్ధంతి సందర్భంగా మంత్రులు తలసాని,నాయిని,మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి నివాళులర్పించిన కేటీఆర్…తెలంగాణ ఉద్యమం నీళ్లు,నిధులు,నియామకాల కోసం జరిగిందన్నారు. స్వరాష్ట్రం కోసం సుదీర్ఘ కాలం పోరాడిన జయశంకర్ సార్ మన మధ్య లేకపోవడం బాధకరమన్నారు. సార్ స్పూర్తితో బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నామని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని స్పష్టం చేశారు.

Naini Narsimha Reddy

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి నివాళులర్పించారు ఎంపీ కవిత. సార్ సేవలను గుర్తుచేసుకున్న కవిత…. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను ప్రపంచానికి చాటిన మహాజ్ఞాని జయశంకర్ సార్ అని కొనియాడారు.

తెలంగాణా రాష్ట్రాన్ని దివంగత ఆచార్య జయశంకర్ సార్ యాదిలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. జయశంకర్ సార్ కోరుకున్న బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అభివృద్ధి,సంక్షేమాన్ని సమపాళ్లలో రంగరించి ముందుకు సాగుతున్నామన్నారు.

- Advertisement -