ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడు ముందుంటాడన్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ వేదికగా సైతం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేటీఆర్ స్పెషాలిటే వేరు. అందుకే కేటీఆర్‌పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడో వ్యక్తి.
మారుతి సుజుకి సంస్థకు చెందిన కారును కొనుగోలు చేసిన కేటీఆర్ వీరాభిమాని, దాని నంబర్ ప్లేట్ లో కేటీఆర్ అన్న అక్షరాలు వచ్చేలా చూసుకున్నాడు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కేటగిరీలో టీఎస్ 11కే టీఆర్ 5343 నంబర్‌ను రిజిస్టర్ చేయించాడు. తాను చేసిన పనిని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన్ను ఫిదా చేశాడు.
కేటీఆర్ గారు… మీరు ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు అని కేటీఆర్ కు ట్యాగ్ చేశాడు. సదరువ్యక్తి అభిమానానికి ఫిదా అయిన కేటీఆర్, ‘నమస్కారం’ చేసే ఎమోజీని ఉంచారు. ఇప్పుడు ఈ ఫోటో కేటీఆర్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
— KTR (@KTRTRS) June 20, 2018