తెలంగాణ అంటే పౌరుషానికి మారుపేరని ఎంపీ కవిత అన్నారు. తెలంగాన సంస్కృతికి గుర్తు బతుకమ్మ అని….ప్రపంచ దేశాలు తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తున్నాయని తెలిపింది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన కవిత బతుకమ్మ సంబరాలు సంతృప్తినిచ్చాయని తెలిపింది. ఈ రెండున్నర సంవత్సరాలు తెలంగాణ సంస్కృతికి స్వర్ణయుగమన్నారు. స్వరాష్ట్రంలో తెలుగుకు ప్రాచీన హోదా సంపాదించామని… తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావించాక అనేక మంది కవులు,కళాకారులను సన్మానించుకున్నామని తెలిపారు. తెలంగాణ నుంచి ప్రధానమంత్రిగా చేసిన పివిని గత పాలకులు విస్మరిస్తే….తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహించిందన్నారు.
తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నామని కవిత తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ కీలక పాత్ర పోషిందన్నారు. అన్ని దేశాలలో కూడా బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు జాగృతి అనేక కార్యక్రమాలు నిర్వహిందన్నారు. విదేశాల్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు మంచి స్పందన వచ్చిందని…తెలంగాణ ఆడబిడ్డలే కాకుండా…అక్కడి ప్రజలు,మేయర్లు పాల్గొన్నాయని తెలిపారు. విదేశాల్లో ఉండే ప్రభుత్వాలు కూడా మన పండగను గుర్తించి గౌరవించే స్ధాయికి చేరుకున్నామని తెలిపారు.
కాలిఫోర్నియా అధికారులు బతుకమ్మ పండుగ కోసం నిధులు ఇచ్చారని తెలిపారు.ఆస్ట్రేలియా,కువైట్ లాంటి దేశాల్లో బతుకమ్మను ఘనంగా నిర్వహించామని తెలిపింది. ఆడబిడ్డలను గౌరవించడం తెలంగాణ సంప్రదాయని తెలిపింది. బహ్రెయిన్‌లో 10 వేల మందితో బతుకమ్మ నిర్వహించామని… స్వీడెన్‌లో బతుకమ్మ సంబరాలు అంబారాన్నింటాయని తెలిపింది.బతుకమ్మ విజయవంతానికి కృషిచేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది ఎంపీ కవిత.
సర్జికల్ స్ట్రైయిక్స్ మీద రాజకీయం చేయటం తగదని..ఆర్మీ చర్యలకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా కవిత తెలిపింది.