ఆయన ఆశ్రమంలో 600 మంది అమ్మాయిలు అదృశ్యం…

231
daati-maharaj
- Advertisement -

దేశంలో రోజు రోజుకు బాబాల బాగోతాలు బయటికి వస్తున్నాయి. ఇప్పటికే అత్యాచారం కేసులో డేరా బాబా జైలు పాలైన విషయం తెలిసిందే. అదే తరహాలో గుజరాత్ వివాదాస్పద గురువు దాతీ మహారాజ్ పై ఆరోపణలు వస్తున్నాయి. తనను తాను దేవుడి అవతారంగా చెప్పుకునే దాతీ మహారాజ్ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా 25 సంవత్పరాల యువతి తనను దాతీ మహారాజ్ అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది.

daati-maharaj

10 సంవత్సరాలుగా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, తనతో పాటు అతని ఇద్దరు అనుచరులు సైతం అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. దాతీ మహరాజ్ సహాయకురాలు అమ్మాయిలను బలవంతంగా ఆయన గదిలోకి పంపింస్తుందని తెలిపింది. ఇక ఆ యువతి ఫిర్యాదు మేరకు దాతీ మహారాజ్ ని విచారించేందుకు వెళ్లిన పోలీసులకు ఆశ్చర్యకర విషయం తెలిసింది. ఆశ్రమంలో 600 మంది అమ్మాయిలు అదృశ్యమైనట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.

కేవలం 100 మంది అమ్మాయిలు మాత్రమే కనిపించారని మిగతావారు ఎక్కడికి వెళ్లారనే దానిపై దర్యాప్తు చేపట్టామని చెప్పారు. అయితే తన ఆశ్రమంలో 700 మంది అమ్మాయిలు ఉన్నారని, వారి బాగోగులు తానే చూసుకుంటానని దాతీ మహారాజ్ గతంలో పలుమార్లు చెప్పుకునేవారు. యువతి ఆరోపణలపై స్పందించిన దాతీ మహారాజ్ తనకు ఆ యువతి కూతురు లాంటిదని పేర్కొనారు. మరోవైపు దాతీ మహారాజ్ ఆశ్రమం వదిలి పారిపోవడం గమనార్హం.

- Advertisement -