రంజాన్‌ వేడుకల్లో పాల్గొన్న పవన్..

420
Pawan Kalyan
- Advertisement -

ఈ రోజు దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్‌ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆనందోత్సాహలతో పండుగ చేసుకుంటున్నారు. రంజాన్ సందర్భంగా పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండగ సందర్భంగా ముస్లింలకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.

Pawan Kalyan

ఈ సందర్భంగా ఓ ట్వీట్‌లో తన సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో రంజాన్ పండగ జరుపుకున్నానని, తనపై ప్రేమ చూపించే ప్రతిఒక్కరికి, సన్నిహితులకు ఈ పవిత్రమైన రోజున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి తాను ఉన్న ఓ ఫొటోను పవన్ కల్యాణ్ పోస్ట్ చేశారు.

అంతేకాదు నిన్న జనసేన పార్టీ తరపున ఓ ప్రకటన విడుదల చేశారు.‘విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పేది రంజాన్..ఇటువంటి గొప్ప సందేశాన్ని అందించే రంజాన్ మాసాన్ని ఎంతో నిష్ఠతో ఆచరించే ముస్లిం సోదర, సోదరీమణులు అందరికీ నా తరపున, జనసైనిక్స్ తరపున రంజాన్ శుభాకాంక్షలు. భారత దేశంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ రంజాన్ పండగ స్ఫూర్తిని ప్రతీ ఒక్కరు ఆచరించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఈ రంజాన్ పండగ దేశ ప్రజలందరికీ శుభాలను అందించాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.

- Advertisement -