ఆస‌క్తిరేపుతోన్న నాని మూవీ టైటిల్…

223
nani
- Advertisement -

విభిన్న మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ టాలీవుడ్ లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్ధాన‌న్ని ఏర్ప‌ర‌చుకున్నాడు న్యాచుర‌ల్ స్టార్ నాని. ఈమ‌ధ్య విడుద‌లైన ఒక కృష్ణార్జున యుద్దం సినిమా త‌ప్ప వ‌రుస‌గా ఎనిమిది సినిమాలు భారీ విజ‌య‌న్ని అందుకున్నాడు. కృష్ణార్జున యుద్దం సినిమాతో ట్రిపుల్ హ్యాట్రిక్ ను మిస్ చేసుకున్నాడు నాని. ప్ర‌స్తుతం నాని బిగ్ బాస్ 2తో పాటు..నాగార్జున తో ఓ మల్టిస్టార‌ర్ మూవీని తీస్తున్నాడు. యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య ఈసినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

ప్ర‌స్తుతం ఈసినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకోటోంది. ద‌స‌రా త‌ర్వాత ఈమూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు తెలుస్తోంది. ఈసినిమా త‌ర్వాత నాని త‌న త‌రువాతి సినిమాను కూడా ప్ర‌క‌టించాడు. ప్రముఖ నిర్మాణ సంస్ధ సితార ఎంట‌ర్టైన్ మెంట్ లో నాని సినిమా చేయ‌నున్న‌ట్లు తెలిపాడు. ఈసినిమాకు మ‌ళ్లి రావా మూవీ డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌మూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అయితే ఈసినిమా టైటిల్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. ఇంత వ‌ర‌కూ నాని కెరీర్ ఇలాంటి టైటిల్ మ‌నం చూడ‌లేదు.

కాసేప‌టి క్రిత‌మే ఈసినిమా టైటిల్ ను ఆవిష్క‌రించారు. జెర్సీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. క‌ల‌ని అందుకోవాలంటే ఆల‌స్యం చేయ‌వ‌ద్దు అనే ట్యాగ్ లైన్ ను జోడించారు. ఈసినిమాలో నాని స్టోర్ట్స్ గెట‌ప్ లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఒకేసారి మూడు ఢిప‌రెంట్ సినిమాలు చేస్తోంది సితార ఎంట‌ర్టైన్ మెంట్ సంస్ధ‌. ప్ర‌స్తుతం నాగ చైత‌న్య మారుతి కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. అలాగే సుధీర్ వ‌ర్మ, శ‌ర్వానంద్ కాంబినేష‌న్ లో కూడా ఓ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

- Advertisement -