ఇంటర్‌ ఫలితాల్లో పొరపాట్లు.. 35కు 38 మార్కులు ..!

232
BSEB 12th result 2018
- Advertisement -

శుక్రవారం రోజున బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు పన్నెండో తరగతి ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాల్లో ఎన్నో పొరపాట్లు అలస్యంగా వెలుగు చూశాయి. మొత్తం మార్కుల కంటే ఎక్కువ మార్కులు వేసి వార్తల్లోకి ఎక్కారు బీహార్ విద్యాశాఖ అధికారులు. గణితం(థియరీ)లో టోటల్ మార్కులు 35 అయితే 38 మార్కులు వేశారు. అబ్జెక్టివ్ ప్రశ్నలు 35 ఉండగా 37 మార్కులు వేశారు.

BSEB 12th result 2018

ఈ సంఘటన అర్వాల్ జిల్లాకు చెందిన భీమ్ కుమార్‌కు అనే విద్యార్ధి విషయంలో చోటు చేసుకుంది. ఈ మార్కులను చూసి షాక్‌కు గురయ్యానని భీమ్ కుమార్ చెప్పాడు. అంతేకాదు ఈస్ట్ చంపారన్ జిల్లాకు చెందిన సందీప్ రాజ్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఫిజిక్స్ థియరీలో 38/35 మార్కులు వచ్చాయి. ఇంగ్లీష్ అబ్జెక్టివ్‌తో పాటు రాష్ట్ర భాషలో జీరో మార్కులు వచ్చాయన్నారు. రాహుల్ కుమార్ అనే విద్యార్థికి మ్యాథ్స్ అబ్జెక్టివ్‌లో 35 మార్కులకు గానూ 40 మార్కులు వచ్చినట్లు వెల్లడించాడు.

- Advertisement -