రోజు రోజుకు కాశ్మీర్ లో అల్లరిమూకలు ఆగడాలు మితిమీరుతున్నాయి. కశ్మీర్ లోని శ్రీగనర్ లోని నౌహట్టాలో సీఆర్పీఎఫ్ వాహనాన్ని లక్ష్యంగా ఎంచుకొని అల్లరిమూకలు దాడులు చేశారు. జీపు చుట్టు అల్లరిమూకలు చేరి వాహనాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఈ వీడియోని రిపబ్లిక్ టీవీ అసోసియేట్ ఎడిటర్ ఆదిత్య రాజ్ కౌల్ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై సీనియర్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు.
తట్టుకోలేకపోతున్నా. దాడులకు పాల్పడిన వారితో ఇంకా చర్చలు జరిపేందుకు భారత్ అవకాశముందని భావిస్తోందా..! ఒక్కసారి తాజా పరిస్థితులను గ్రహించండి. సైనిక దళాలకు రాజకీయ మద్దతు ఇవ్వండి వారి సత్తా ఏంటో, ఫలితం ఎలా ఉంటుందో చూపిస్తారు. ఆర్మీ వాళ్ల బాధలు తెలియాలంటే రాజకీయ నాయకులు ఏ భద్రతా లేకుండా వారం రోజులు వారి కుటుంబంతో కలిసి కాశ్మీర్ లో నివసించాలి. ఆ తర్వాతే వారిని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని గంభీర్ ట్వీట్ చేశాడు.
గౌతు ఇప్పుడే కాదు చాలా సందర్భాలలో దేశ భక్తిని చాటుకున్నాడు. సుక్మాలో నక్సల్ చేసిన దాడిలో కన్నుమూసిన జవాన్ల పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్న సంగతి తెలిసిందే. కాశ్మీర్ లో ఉగ్రవాదులు కాల్పుల్లో మరణించిన జవాన్ల కుటుంబాలకు గౌతు ఆర్థిక సహాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇక మరోవైపు గౌతు రాజకీయాల్లోకి రావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Look at how a mob of stone pelters today targeted a @crpf_srinagar vehicle at Nowhatta in Srinagar, Kashmir. Just imagine what could have happened if they would’ve been able to open the gypsy doors. No Kashmir media outlets will show this truth as it doesn’t suit the propaganda. pic.twitter.com/drOyKEtTwz
— Aditya Raj Kaul (@AdityaRajKaul) June 1, 2018
I have a solution:Make it mandatory for politicians to spend a week in troubled parts of Kashmir along with their families&without security. Only then they b allowed to contest 2019 elections. No other way to make them understand d plight of armed forces & a well-meaning Kashmiri https://t.co/PdtCNVbOqr
— Gautam Gambhir (@GautamGambhir) June 2, 2018