ఆర్‌ఎస్‌‌ఎస్ సమావేశానికి అతిధిగా ప్రణబ్..

232
pranab
- Advertisement -

భారత మాజీ రాష్ట్రపతి,కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశానికి హాజరుకానున్నారు. ఇప్పుడు ఇదే వార్త జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తన జీవితం మొత్తం కాంగ్రెస్‌కే అంకితం చేసిన ప్రణబ్…పలు సందర్భాల్లో హిందుత్వ వాదాన్ని వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు అదే హిందుత్వ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ శిక్షణ తరగతుల్లో ప్రసంగించనున్నారు. ఇందుకు నాగపూర్‌ వేదిక కానుంది.

ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో సంఘ్ శిక్షా వర్గ (ఎస్ఎస్‌వీ) మూడవ వార్షికోత్సవంలో ప్రణబ్ ప్రసంగించనున్నారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో జరిగే వార్షిక కార్యక్రమానికి ప్రణబ్‌ను ఆహ్వానించినట్టు సంఘ్ సిద్ధాంతకర్త రాకేష్ సిన్హా తెలిపారు. ఇందుకు ప్రణబ్ సైతం సమ్మతి తెలిపారని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌కు బద్ధ శత్రువైన సంఘ్ ఆఫీస్‌కు వెళ్లి ప్రణబ్ ప్రసంగించడం ఏంటని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్‌ పార్టీ నేతలు కూడా నో కామెంట్‌…ప్రణబ్‌నే అడగండి అని వ్యాఖ్యానించారు. మా సిద్ధాంతాలకు, వాళ్ల సిద్ధాంతాలకు చాలా తేడా ఉంది అని తెలిపారు. ఆరెస్సెస్‌ను ఎప్పుడూ ద్వేషించే వ్యక్తిని ముఖ్య అతిథిగా పిలుస్తున్న సంఘ్ ఈ విషయంపై మరోసారి ఆలోచించుకోవాలని వారు సూచించారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు మాత్రం కాంగ్రెస్‌ నేతల మాటలను తేలిగ్గా తీసుకున్నారు. గతంలో జయప్రకాష్ నారాయణ్ (జనాతా పార్టీ నేత), ఎన్‌జీ గోరె (ప్రముఖ మరాఠీ సోషలిస్ట్), డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (మాజీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి) వంటి ప్రముఖులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారని గుర్తు చేస్తున్నారు.

- Advertisement -