కుమారుడిని కోల్పోయి బాధపడుతున్న కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. హైదరాబాద్ రాంనగర్‌లోని ఆయన నివాసానికి శనివారం సాయంత్రం వెళ్లిన సీఎం కేసీఆర్ దత్తాత్రేయను పరామర్శించి ఓదార్చారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. సీఎం వెంట మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, టీఆర్ఎస్ సీనియర్ నేత రాజారపు ప్రతాప్ ఉన్నారు. పలువురు ప్రముఖులు కూడా వేర్వేరుగా దత్తాత్రేయను పరామర్శించారు.
ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, శతృఘ్నసిన్హా, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రశాంత్‌రెడ్డి, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, గణేశ్‌గుప్తా, టీ జీవన్‌రెడ్డి, జీ కిషన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు,
డీజీపీ మహేందర్‌రెడ్డి, తెలంగాణ నీటివనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, మహారాష్ట్ర స్పీకర్ హరిబాబు బగాడే, మాజీ ఎంపీలు యశ్వంత్ సిన్హా, నందమూరి హరికృష్ణ, అల్లాడి రాజ్‌కుమార్, నామా నాగేశ్వరరావు, కంభంపాటి రామ్మోహన్, సీ రామచంద్రయ్య, సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యులు నారాయణ, జస్టిస్ భాస్కర్‌రావు, ప్రజాగాయకురాలు విమలక్క, పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు పరామర్శించినవారిలో ఉన్నారు.