విశ్వనగరాన్ని నిర్మించడంలో హైదరాబాద్ నగర పౌరులు ప్రభుత్వంతో కలిసి రావాలని పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు పిలుపునిచ్చారు. నగరంలో ప్రపంచ స్ధాయి మౌళిక వసతుల కల్పనతోపాటు ప్రజలకు అవసరం అయిన కనీస సౌకర్యాల కల్పన ద్వారానే విశ్వనగర కల సాకారం అవుతుందన్నారు. ఇప్పటికే అనేక వందల కోట్లతో రోడ్ల అభివృద్ది కార్యక్రమాలు, మౌళిక వసతుల కల్పన చేపట్టామని, మరోపైపు ప్రజలకు తాగునీటి సరఫరాను మెరుగుపర్చేందుకు అనేక ప్రణాళికలు చేపట్టామని తెలిపారు. ఈ రోజు కూకట్ పల్లిలోని కొలను రాఘవ రెడ్డి గార్డెన్స్‌లో జరిగిన మన నగరం కార్యక్రమంలో మంత్రి పాల్గోన్నారు. స్ధానిక సమస్యలను, ప్రభుత్వ కార్యక్రమాలపైన పౌరుల స్పందన, సూచనలు, సలహాలను తీసుకుని ప్రభావవంతమైన పాలన అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి తెలిపారు.
ప్రభుత్వంతో ప్రజలు కలిసి నడిచినప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని, ప్రజల భాగసామ్యం మరింత పెంచేందుకే మన నగరం చేపట్టామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే నగరంలో రెండు కార్యక్రమాలను పూర్తి చేసుకుని అక్కడ దీర్ఘకాలంగా పరిష్కారం కానీ సమస్యలకు పరిష్కారం చూపించామన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రి వివరించారు. ఏస్సార్డీపి, మూసీ ప్రక్షాళన అభివృద్ది, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, పారిశుద్ద్యం వంటి అంశాలను మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి స్వచ్చ హైదరాబాద్ లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమానికి ముందు నగరంలో రోజు కేవలం 3500 వందల మెట్రిక్ టన్నులుగా ఉన్న చెత్త తరలింపు ప్రస్తుతం సూమారుగా 4800 మెట్రిట్ టన్నులుగా ఉందన్నారు. తడి పొడి చెత్త కార్యక్రమం, స్వచ్చ అటోల వినియోగం వంటి వినూత్న కార్యక్రమాల ద్వారానే ఇది సాద్యం అయిందన్నారు.
అయితే ప్రభుత్వంతో పాటు ప్రజలు తమ నగరం అన్న భావనతో ఈ పారిశుద్ద్యం కార్యక్రమంలో మరింత భాగస్వాములు అయితే స్వచ్చనగర కల సాకారం అవుతుందన్నారు. ఇప్పటికే సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ లో ఇతర మెట్రోలతో పోల్చితే హైదరాబాద్ మెదటి స్ధానంలో నిలిచిందన్నారు. మరోపైపు ప్రజలకు మరింత తాగునీరు అందించేందుకు సరఫరా వ్యవస్దను విస్తరించడం, పాత పైపులైన్ల రిప్లేస్ మెంట్, నూతన సరఫరా పనుల ద్వారా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. జలమండలి ద్వారా ఈ కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు. నగరంలో మౌళిక వసతులతోపాటు శాంతి భద్రతలు, కాలుష్య నియంత్రణ వంటి కార్యక్రమాలకూ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఫార్మసిటీకి పర్యావరణ అనుమతులూ వచ్చాయని, త్వరలోనే దశల వారీగా నగరంలో కాలుష్య కారక పరిశ్రమలను నగరం బయటకు తరలించాలన్న లక్ష్యంలో పనిచేస్తున్నామన్నారు. విశ్వ నగరంగా తయారు చేయడంలోపాటు క్లీనర్, గ్రీనర్, సేఫర్ సీటీ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వంతో కలిసి వచ్చి, పౌరులుగా పురపాలనలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.
కూకట్‌పల్లి నియోజక వర్గంలోని అపార్ట్ మెంట్ కమీటీలు, రెసిడెన్షియల్ వెల్పేర్ అసోషియేషన్లు, సామాజిక సంస్ధలు, వివిధ రంగాల నిపునులు, సాదారణ ప్రజలు హజరయిన ఈ సమావేశంలో పలు సమస్యలు, అంశాలపైన మంత్రితో మాట్లాడారు. ముఖ్యమంత్రి విజన్ మేరకు నగరం విశ్వనగరంగా మారుతున్నదని, ప్రభుత్వ కార్యక్రమాలు పెద్ద ఏత్తున నగరంలో నడుస్తున్నాయని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. కూకట్‌పల్లిలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలను స్ధానిక ఎమ్మెల్యే క్రిష్టారావు, ఎంపీ మల్లారెడ్డిలు వివరించారు. ఈ సమావేశాన్ని నగర మేయర్ బొంతు రామ్మెహాన్ నిర్వహించారు. స్దానికంగా ఉన్న పలు సమస్యలను ప్రస్తావించగా అక్కడికక్కడే పలు అధికారులకు పలు అదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లో అధికారులు ఏఏ అంశాలను యుద్ద ప్రాతిపాధికన చేపట్టనున్నారో తెలుపుతారని మంత్రి ప్రజలకు హమీ ఇచ్చారు. ఈ సమావేశానికి నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, కమీషనర్, జెడ్సీలు, ఇతర శాఖ ఉన్నతాధారులు పాల్గోన్నారు.
మన నగరానికి హాజరయిన 86 ఏళ్ల వృద్దురాలు… ప్రజలతో మమేకం కావడానికి ఏర్పాటు చేసిన మన నగరం కార్యక్రమం విజయ వంతంగా సాగుతుంది. ఈరోజు జరిగిన సమావేశానికి కూకట్ పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన శేషా నవరత్నం అనే 85 ఏళ్ల వృద్దురాలు తనకున్న సమస్యను మంత్రికి నేరుగా చెప్పెందుకు వచ్చింది. శేషా నవరత్నంను మంత్రి స్వయంగా పిలుచుకుని మాట్లాడారు. స్జేజీ పైననే పక్కన కూర్చోబెట్టుకుని మట్లాడారు. తాను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ కింది భాగంలో ఒక రెస్టారెంట్ వారు అక్రమంగా కిచెన్ నడుపుతున్నారని, కోర్టు కేసులతో దీన్ని కోనసాగిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని కోరారు. వేంటనే స్పందించిన స్దానికి జోనల్ కమీషనర్ హరి చందనతో పాటు నగర సిసిపి దేవేందర్ లకు ఈ అంశంలో చర్యలు తీసుకోవాలని అదేశాలు జారీ చేశారు. సమస్యను పరిష్కరిస్తామని హమీ ఇచ్చిన మంత్రి, శేషా నవరత్నంను జాగ్రత్తగా ఇంటి వద్దకు సాగనంపాలని అధికారులకు అదేశాలు జారీ చేశారు. మంత్రి స్పందించిన తీరు పట్ల వృద్దురాలు హర్షం వ్యక్తం చేశారు.