కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాధోడ్ ‘హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్’ కొత్త ఛాలెంజ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన పుషప్స్ చేస్తున్న వీడియోని హీరో హృతిక్ రోషన్, సైనా నెహ్వాల్ , విరాట్ కోహ్లీకి సవాల్ విసిరారు. ఈ ఛాలెంజ్‌ని హీరో హృతిక్ స్వీకరించి తాను జాగింగ్, సైక్లింగ్ చేస్తున్న వీడియోను పోస్టు చేశాడు. సైనా కూడా జిమ్‌లో కసరత్తు చేస్తున్న వీడియోని షేర్ చేసి.. గంభీర్, రాణా, పి.వి సింధులకు సవాల్ విసిరింది. సింధు సైతం ఇందులో పాల్గొని అక్కినేని అఖిల్‌కు పోస్టు చేసింది.
.ఇక అఖిల్ కూడా తాను జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ఛాలెంజ్‌ని నాగార్జున, నాగ చైతన్య, దుల్కర్ సల్మాన్, వరుణ్ ధావన్‌లకు సవాల్ విసిరాడు. అఖిల్ విసిరిన సవాలన్‌ను నాగచైతన్య స్వీకరించి తాను జిమ్‌లో పుషప్స్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. చైతూ కూడా మరో నలుగురికి ట్యాగ్ చేశాడు. ఇందులో సమంత, నిధి అగర్వాల్, సుశాంత్‌లు ఉన్నారు.
ఇక కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాధోడ్ విసిరిన సవాల్‌ని స్వీకరించిన కోహ్లీ దానిని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ట్యాగ్ చేశారు. దీనికి మోడీ సైతం రిప్లై ఇచ్చారు. కోహ్లీ విసిరిన ఫిట్ నెస్ ఛాలెంజ్‌ని తాను స్వీకరిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ లో తెలిపారు. చాలెంజ్‌ని అంగీకరిస్తున్నా విరాట్. త్వరలోనే నా యోగా వీడియోను షేర్ చేస్తా అని మోడీ పేర్కొన్నారు.
Thanks @AkhilAkkineni8 for the challenge #HumFitTohIndiaFit here are my 3 basics I do anytime anywhere to keep it going .. I challenge @Samanthaprabhu2 @iamSushanthA @AgerwalNidhhi pic.twitter.com/lXrdr8SMJo
— chaitanya akkineni (@chay_akkineni) May 24, 2018
Thank you @Pvsindhu1 for the challenge💪🏻 #HumFitTohIndiaFit
Post pictures and videos of how you keep yourself fit and send a #FitnessChallenge to someone you know on social media . Here's my video and I challenge @iamnagarjuna @Varun_dvn @chay_akkineni and @dulQuer 💪🏻 pic.twitter.com/9fWHVRmWrB
— Akhil Akkineni (@AkhilAkkineni8) May 23, 2018