ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏ గల్లీలో చూసినా క్రికెట్ ఆడుతున్న పిల్లలే కనిపిస్తారు. ఇక భారత్‌లో అయితే ఢీల్లీ నుంచి గల్లీ వరకు చాలా మంది చిన్నారులు క్రికెట్ ఆడుతూనే కనిపిస్తుంటారు. అయితే గల్లీలలో జరిగే క్రికెట్లో చిన్న చిన్న సందేహాలతో కూడిన గొడవలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో బ్యాట్ప్‌మెన్ ఔట్ అని బౌలర్, కాదని బ్యాట్స్‌మెన్ వాదనకు దిగుతుంటారు. ఇలాంటి సంఘటనే పాకిస్థాన్ గల్లీ క్రికెట్లో చోటుచేసుకుంది. ఈ గల్లీ పంచాయతీలో థర్డ్ ఎంపైర్‌గా ఐసీసీ వ్యవహరించడం విశేషం.
పాకిస్థాన్‌లో జరిగిన గల్లీ క్రికెట్ మ్యాచ్ లో ఓ బ్యాట్స్‌మెన్ బంతిని బలంగా కొట్టాడు.. కానీ ఈదురు గాలుల వల్లన ఆ బంతి మళ్లీ వెనక్కి వచ్చి వికెట్లను తాకింది. ఈ నేపథ్యంలో బౌలర్, బ్యాట్స్‌మెన్ మధ్య ఔటు..కాదు అనే వివాదం తలెత్తింది. ఈ వీడియోని సరదాగా ఐసీసీకి ట్వీట్ చేసి.. మీరే న్యాయం చెప్పండంటూ హమజా అనే వ్యక్తి అడిగాడు. ఈ ట్వీట్‌కి ఐసీసీ కూడా స్పందించడం ఆశ్చర్యం.
క్రికెట్ లా 32.1 ప్రకారం ఆ బ్యాట్స్‌మెన్ ఔట్ అని ఐసీసీ తీర్పు చెప్పింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బ్యాట్స్‌మెన్ ఔట్ అయిన తీరును చూసి నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోపై మీరు ఒక లుక్కేసి.. మీరు ఓ సరదా కామెంట్ చెయ్యండి.
A fan named Hamza sent this video to us this morning asking for a ruling.
Unfortunately for the (very unlucky) batsman, law 32.1 confirms… Out! ☝ pic.twitter.com/y3Esgtz48x
— ICC (@ICC) May 22, 2018