ఐపిఎల్ 11వ సిజిన్ లో ప్లే ఆఫ్ మ్యాచ్ లు ముగిసాయి. నేటితో క్యాలిఫైర్ మ్యాచ్ లు జరగనున్నాయి. నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలబపడనుంది. ఇరు జట్లు భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్నాయి. రెండు ఏళ్ల విరామం తర్వాత చెన్నై టీం మళ్లి బరిలోకి దిగడంతో ఎలాగైనా కప్ గెలవాలనే లక్ష్యంతో ఆడుతుంది. మరోవైపు తమ పటిష్టమైన బౌలింగ్ తో ప్రత్యర్దులను కట్టడి చేస్తూ మ్యాచ్ ను విజయం వైపు తీసుకెళ్తున్నారు హైదరాబాద్ ప్లేయర్లు. ఇక పాయింట్లపట్టికలో మొదటి ప్లేస్ లో హైదరాబాద్ ఉండగా…రెండవ ప్లేస్ లో చైన్నై ఉంది. ఇకనేడు జరిగే మ్యాచ్ లో గెలిచిన టీం నేరుగా ఫైనల్ కు చేరగా..ఓడిన టీంకు మరోఅవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచే టీమ్ తో ఇవాళ ఓడిన టీం ఆడనుంది.ఇక ఐపిఎల్ లో అత్యధిక పరుగుల వీరుడిగా విరాట్ కోహ్లి నెంబర్ 1ప్లేస్ లో్ ఉన్నారు. అతని తర్వాతి స్ధానంలో సురేష్ రైనా రెండవ ప్లేస్ లో ఉన్నారు. బెంగళూరు టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డుకు రైనా చేరవలో ఉన్నాడు. కోహ్లి 4948పరుగులతో మొదటి ప్లేస్ లో ఉండగా..సురేష్ రైనా 4931పరుగులతో సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. విరాట్ కోహ్లిని అందుకోవడానికి రైనా ఇంకా 17పరుగులు మాత్రమే చేయాలి. ఒక ఐపిఎల్ బరిలోంచి బెంగుళూరు వెళ్లిపోవడంతో సురేష్ రైనా కోహ్లి రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొవచ్చు. ఐపిఎల్ లో రైనా మొత్తం 174మ్యాచ్ లు ఆడి ఒక సెంచరీ, 35 హాఫ్ సెంచరీలు చేశాడు..కోహ్లి 4 సెంచరీలు చేయగా…34హాఫ్ సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు.
కోహ్లి రికార్డు రైనా బ్రేక్ చేస్తాడా?
- Advertisement -
- Advertisement -