ఐపీఎల్లో ఆటగాళ్లను, అభిమానులను ఉత్సాహపరుస్తుంటారు చీర్ గర్ల్స్. ప్రతి ఒక్క జట్టుకు చీర్ గర్ల్స్ ఉంటారు. ఆటగాళ్లు ఫోర్లు, సిక్సులతో అదరగొడుతున్నప్పుడు.. వీళ్ల డ్యాన్స్ తో ఆ మ్యాచ్‌కి మరింత ఉత్సాహాన్ని తీసుకువస్తారు. తాజాగా చీర్ గర్ల్స్ విషయంలో ఢిల్లీ యాజమాన్యం చేసిన పనికి… బీసీసీఐ చివాట్లు పెట్టింది.
ఈ సీజన్లో ఐపీఎల్ లీగ్ దశ నుంచి ఢిల్లీ డేర్ డెలివల్స్ నిష్ర్కమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టు నిర్వాహకులు, మేనేజ్మెంట్, ఆటగాళ్లందరూ విందు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈ విందు కార్యక్రమానికి చీర్ గర్ల్స్‌ని కూడా ఆహ్వానింనించారు. చీర్ గర్ల్స్ ఈ విందులో పాల్గొన్న విషయం తెలుసున్న బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ ఢిల్లీ ప్రాంఛైజీ అధికారులకు చివాట్లు పెట్టింది. ఇలా చేయడం నిబంధనలను ఉల్లఘించినట్లే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది
ఐపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వెలువడినప్పటి నుంచి ఆటగాళ్లను బయటి వ్యక్తులు కలవకూడదన్న నిబంధనలు తీసుకువచ్చింది బీసీసీఐ. ఆటగాళ్లు పాల్గొనే ఏ ప్రైవేట్ కార్యక్రమంలో బయటి వ్యక్తులు ఎవరూ పాల్గొనకూడదు.
మరోవైపు ఈ సంఘటనపై ఢిల్లీ యాజమాన్యం స్పందించింది. ఆటగాళ్లు చీర్ గర్ల్స్‌కి ఇచ్చిన విందు కాదు ఇది. వాళ్లు వచ్చారు తిన్నారు వెళ్లిపోయారు. ఈ విషయంపై బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆగ్రహం ఉన్నారని తెలిసింది. వారితో మేం మాట్లాడతాం అంటూ ఢిల్లీ యాజమాన్యం తెలిపింది.