ప్రియురాలి బర్త్‎డే కోసం.. ప్రభుత్వ వెబ్‎సైట్ హ్యాక్

211
Jamia university website hacked
- Advertisement -

తమ ప్రేమను వ్యక్త పరచడానికి ఈ తరం యువకులు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం కోసం సోషల్ మీడియాను తెగవాడేస్తున్నారు. అయితే ఓ ఆకతాయి మాత్రం ఏకంగా ప్రభుత్వ అధీనంలోని ఓ సంస్థ వెబ్‎సైట్‎ని హ్యాక్ చేశాడు. ఈ సంఘటన ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ‎లో చోటుచేసుకుంది. తన ప్రేమ ను తెలిపేందుకు ఆ ఆకతాయి ఆ యూనివర్శిటీ వెబ్ సైట్‎ని వాడేసుకున్నాడు. ఆ వెబ్‎సైట్‎లో హ్యాపీ బర్త్‎డే పూజా అనే పేరు ప్రత్యక్షమయ్యేలా చేశాడు.

మరోవైపు ఈ ఘటనపై యూనివర్శిటీ బృందం మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ ఘటనపై ట్విట్టర్ లో జోకులు పేలుతున్నాయి. తన ప్రేమను తెలియజేయడానికి ఇదే దొరికిందా.. మరో మార్గం కనిపించలేదా అంటూ స్పందించగా. పూజ అనే అమ్మాయి చాలా అదృష్టవంతురాలని మరికొందరు స్పందిస్తున్నారు. ఇంకొందరైతే ప్రభుత్వ ఆధీనంలోని ఒక సంస్థ వెబ్‎సైట్‎ని హాక్ చేయడం తప్పు అని ఆ ప్రేమదాసుని కడిగి పారేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆ వెబ్‎సైట్‎ను తిరిగి అధీనంలోకి తీసుకున్న జామియా యూనివర్శిటీ బృందం తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించింది.

- Advertisement -