కాబోయే కర్ణాటక సీఎం జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి సూపర్ స్టార్ రజనీకాంత్ పై ఘూటుగా ఫైరయ్యారు. కావేరి నదీ జలాల విషయంపై నిన్న రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై కుమారస్వామి స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కావేరి నదీ జలాలను దిగువ ఉన్న తమిళనాడు రాష్ట్రానికి విడుదల చేయాలని నిన్న రజనీకాంత్ కర్ణాటక ప్రభుత్వానికి విజ్నప్తి చేశారు. కావేరి నదీని తమిళనాడుతో పంచుకునేందుకు సరిపడా జలాలు తమ వద్ద లేవంటూ తేల్చి చెప్పారు కుమారస్వామి. కావేరి నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాటే తన మాట అన్నారు. గత ప్రభుత్వ ఏవిధంగా స్పందించిందో తాను కూడా అలాగే చేస్తానన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి విడుదల సాధ్యం కాదని తేల్చి చెప్పారు. కర్ణాటకలో సరిపడ సాగునీరు ఉంటేనే తమిళనాడుకు నీటిని విడుదల చేయడం సాథ్యం అని…రజనీకాంత్ ఒక సారి కర్ణాటకు వచ్చి మా డ్యాంలు, చెరువులు, రైతుల పరిస్ధితి, స్ధితిగతులు పరిశీలించాలన్నారు. వాళ్ల పరస్ధితి చూసిన తర్వాత కూడా మీకు నీళ్లను విడుదల చేయాలంటే కూర్చుని మాట్లాడుకుందాం అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు ఏటా 177.25 టీఎంసీల కావేరి జలాలను విడుదల చేయాల్సి ఉంటుంది.
తమిళనాడులో కావేరి జలాలకోసం రైతులు పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కావేరి జాలాల పంపకంపై పర్యవేక్షించేందుకు వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయడంలో కేంద్రం ఆలస్యం చేయడంతో తమిళనాడులో నిరసనలు వ్యక్తం మవుతున్నాయి. ఇక కాంగ్రెస్ జేడీఎస్ ల పొత్తుతో కుమారస్వామికి సీఎం పదవి వరించింది. మరో రెండు రోజుల్లో కుమారస్వామి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.