మా నాన్న గొప్ప టైలర్ అని గర్వంగా చెప్పగలను-అలీ

400
IM Not Forget My Old Days-actor Ali
- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో బాల నటుడిగా అడుగుపెట్టి… హాస్య నటుడిగా ఎదిగారు అలీ. తొలిసారిగా ఆయన దర్శకుడు కె.విశ్వనాథ్ సినిమాలో బాలనటుడిగా చేశారు. అనంతరం దేవుడు మావయ్య, ఘారానా దొంగ, సిరిమల్లె నవ్వింది వంటి సినిమాలలో బాలనటుడిగా నటించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను నవ్వింస్తుటారు. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో అలీ చెప్పే ఎంద చాట అంటూ చెప్పే సన్నివేశం ఇప్పటికీ నవ్వులు తెప్పిస్తుంది.

IM Not Forget My Old Days-actor Ali

తెలుగు ప్రేక్షకులకు హీరోగాను పరిచయమయ్యారు అలీ. తాజాగా ఓ ఇంటర్య్యూలో మాట్లాడుతూ.. తన సినీ ప్రమాణం గురించి ప్రస్తావించారు. నేను గోల్డెన్ స్పూన్‎తో పుట్టలేదు.. ఆ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను.. నా సొంత ఊరును ఎప్పటికీ మరిచిపోను అన్నారు. విజయాలు అందాయని కాలుమీద కాలేసుకుని చెప్పే అలవాటు నాకు లేదు అని తెలిపారు. మా నాన్నగారు ఓ టైలర్ నేను గర్వంగా చెప్పుకుంటానని చెప్పారు.

ఎందుకంటే ఆ రోజుల్లో భరతనాట్యం, కూచిపూడి, కథకళికి సంబంధించిన డ్రెస్‎లు అన్ని అక్కడ మా నాన్న ఒక్కరే కుట్టేవారు. ఇక అప్పట్లో ఫోర్ పీస్ సూట్లు కుట్టడంలోనూ మా నాన్నకి మంచి నైపుణ్యం ఉండేది. అలా కుట్టగా మిగిలిపోయిన క్లాత్‎ని… నాకు సూట్ కుట్టేవారని.. అది వేసుకుని వెళితే అంతా గొప్పగా చూసేవాళ్లని చెప్పుకొచ్చారు.

- Advertisement -