నేడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ స్టార్స్ నుంచే కాక అభిమానుల నుంచి బర్త్ డే విషెష్ వెల్లువల దూసుకొస్తున్నాయి. అభిమాన నటుడు తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత’.
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా నిన్న (శనివారం) ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. కాగా నేడు ఈ సినిమాకు సంబంధించి తారక్, హీరోయిన్ పూజా హెగ్డే గట్టుపై కూర్చున్న మోషన్ పోస్టర్‌ను విడుదల చేస్తూ పుట్టిన రోజు శూభాకాంక్షలు తెలిపారు చిత్ర యూనిట్. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్‌కు జన్మదిన శూభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే తారక్.. నీకు అన్నీ విజయాలే దక్కాలని, చేసిన ప్రతీ పని మంచిగా జరగాలని కోరుకుంటున్నా’ అని తెలుపుతూ ట్వీట్ చేశారు. గతంలో మహేష్ ‘భరత్ అనే నేను’ ఆడియో ఈవెంట్ కి ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే.
Happy birthday, @tarak9999 🙂 Wish you all the victories, love and everything positive!
— Mahesh Babu (@urstrulyMahesh) May 20, 2018