గూగుల్ ట్రెండింగ్‎లో కుమారస్వామి భార్య రాధిక…‎

233
- Advertisement -

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసారు. యడ్యూరప్ప రాజీనామాతో కథ సుకాంతం కాగా జేడీఎస్ నేత కుమారస్వామి కర్ణాటక సీఎంగా ప్రమాణస్వాకారం చేయనున్నారు. గత కొన్ని రోజులుగా కర్ణాటక ఎన్నికలపై సోషల్ మీడియాలో యూత్ యాక్టీవ్‎గా ఉంది. అయితే ఇప్పుడు సీఎంగా ప్రమాణం చేయనున్న కుమారస్వామి భార్య గురించి నెట్టింట్లో తెగ వెతుకుతున్నారు. కన్నడలో 32 సినిమాల్లో కథానాయికగా నటించిన రాధికా గురించి గూగుల్‎లో యూత్ తెగవెతికేస్తున్నారు. తాజాగా గూగుల్ ట్రెండింగ్‎లో రాధికా కుమారస్వామి ఇప్పుడు టాప్‎లో ఉన్నారు.

Google Trending In Kumaraswamy's wife Radhika Kumaraswamy

అయితే 17 సంవత్సరాలు చిన్నదైన రాధికకు 2005లో కుమారస్వామితో పరిచయం ఏర్పడింది. అనంతరం 2006లో వీరు పెళ్లిచేసుకున్నారు. ఆపై నాలుగేళ్ల తర్వాత రాధిక స్వయంగా తాను కుమారస్వామిని వివాహం చేసుకున్నట్లు చెప్పి అప్పట్లో సంచలనమే సృష్టించింది. మరోవైపు వీళ్లిద్దరికి ఇది రెండో వివాహం కావడం విశేషం.

1986లో అనితను వివాహం చేసుకున్న కుమారస్వామి, ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి విడిపోయారు. 2002లో రతన్ కుమార్‎ను వివాహం చేసుకున్న రాధిక, భేదాభిప్రాయాలతో అతని నుంచి విడిపోయారు. ప్రస్తుతం వీళ్లకు ఒక పాప కూడా ఉంది. వివాహం అనంతరం  రాధిక నిర్మాతగా కొనసాగుతున్నారు.

- Advertisement -