బోయపాటి శ్రీను, రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. కాసేపు విశ్రాంతి దొరకడంతో అక్కడి ఓ చెరువులో చెర్రీ చేపలకు ఆహారం వేయగా అందుకు సంబంధించిన వీడియోను ఆయన భార్య ఉపాసన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అలాగే, ఈ సినిమా హీరోయిన్ కైరా అద్వానీతో కలిసి రామ్ చరణ్ వ్యాయామం చేస్తోన్న మరో వీడియో కూడా అలరిస్తోంది.
ప్రస్తుతం ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుండగా, బోయపాటి కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.
కన్నడ హీరో సుదీప్ ఈ సినిమాలోను విలన్‌గా కనిపిస్తాడని అంటున్నారు. ఇక చరణ్ అన్న పాత్రల్లో కోలీవుడ్ హీరో ప్రశాంత్ (జీన్స్ ఫేం), నవీన్ చంద్ర లు నటిస్తున్నారు. డీవివి ఎంటర్టైన్మెంట్ బేనర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కానుందని తెలుస్తుంది. ఈ మూవీకి రాజవంశస్థుడు, రాజ మార్తాండ అనే టైటిల్స్‌ని పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Spending time to re connect with nature in between shots – #rc12 #ramcharan #metime pic.twitter.com/z2054IIevR
— Upasana Konidela (@upasanakonidela) May 19, 2018