టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్న గోవా బ్యూటీ..

221
Ileana Re entry with Raviteja movie..
- Advertisement -

టాలీవుడ్‌లో ఒక్కప్పుడు టాప్ హీరోలందరి సరసన నటించి నటనపరంగా మంచి పేరునే సంపాదించుకుంది గోవా బ్యూటీ ఇలియానా. అప్పుడు తెలుగులో మంచి మంచి సినిమాలు చేస్తూ తన జోరును కొనసాగించింది. ఆ తర్వాత బాలీవుడ్‌ నుంచి ఆఫర్లు రావడంతో అక్కడ పరీక్షించుకునేందుకు వెళ్లిన ఈ బ్యూటీకి ఆశించినంత స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో మళ్లీ టాలీవుడ్‌లోకి వచ్చే ప్రయత్నాలు చేసినా.. ఆ ప్రయత్నాలు విఫలమవడంతో చేతులుకాల్చుకుంది.

  Ileana Re entry with Raviteja movie..

ఆ తర్వాత తెలుగులో నటించే అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోవటంతో నిరాశ చెందింది. వరుస వైఫల్యాలు చుట్టుముట్టడంతో ఏం చేయాలో తెలియని  పరిస్థితుల్లో ఉంది ఈ బ్యూటీ. తాజాగా ఉన్నట్టుండి ఈ బ్యూటీకి టాలీవుడ్‌ నుంచి అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ అనే సినిమాలో రవితేజ సరసన నటించే ఛాన్స్‌ను కొ్ట్టేసింది.

గతంలో రవితేజతో ‘కిక్’, ‘ఖతర్నాక్’, ‘దేవుడు చేసిన మనుషులు’ వంటి చిత్రాల్లో నటించింది ఇలియాన. ఇప్పుడు చేయబోయే సినిమాలో రవితేజ మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. ఇందులో హీరోయిన్‌గా శ్రుతిహాసన్‌ను ఎంపిక చేసుకోగా మరో హీరోయిన్‌గా ఇలియానను ఎంపిక చేసుకున్నారు చిత్ర యూనిట్. గతంలో అల్లు అర్జున్ సరసన ‘జులాయి’ చిత్రం తర్వాత మళ్లీ తెలుగులో నటించబోయే చిత్రం ఇదే.

- Advertisement -