- Advertisement -
క్యూబాలో ఘోర విమానం ప్రమాదం చోటు చేసుకుంది. హవానాలోని జోస్ మార్టి విమానాశ్రయం నుంచి శుక్రవారం ఉదయం 11 గంటలకు బయలుదేరిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 100 మందికిపైగా మృతి చెందినట్లు తెలుస్తోంది.ప్రమాదానికి గురైన బోయింగ్ 737 విమానంలో 105 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నారని సమాచారం.
విమానంలో ఉన్నవారిలో ముగ్గురు మాత్రమే తీవ్ర గాయాలతో బతికి బయటపడ్డారని క్యూబా అధ్యక్షుడు మిగ్యుయెల్ డియాజ్ కానెల్ తెలిపారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఆయన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపిన ఆయన మృతులకు సంతాపం ప్రకటించారు. క్యూబానా ఎయిర్‌లైన్ సేవల పట్ల ఫిర్యాదులు వస్తున్నాయంటూ ఆ దేశ ఉపాధ్యక్షుడు హెచ్చరించిన మరుసటి రోజే ప్రమాదం జరగడం బాధాకరం.
- Advertisement -