రేపే బలపరీక్ష…సిద్ధమన్న కాంగ్రెస్

228
karnataka
- Advertisement -

కన్నడ రాజకీయాలు తుది అంకానికి చేరుకున్నాయి. సీఎం యడ్యూరప్ప ప్రమాణస్వీకారాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్,జేడీఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కీలక తీర్పు వెలువరించింది. రేపు సాయంత్రం 4గంటలకు బలపరీక్ష నిర్వహించాలని సూచించింది. ఎవరికి మెజారిటీ ఉందో నిర్ణయించేది గవర్నర్ అని తెలిపింది. యడ్యూరప్ప తాను ఇచ్చిన లేఖలో ఎందుకు ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావించలేదని సుప్రీం ప్రశ్నించింది. రేపు బలపరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని డీజీపీని ఆదేశించింది. మరోవైపు రేపు బలపరీక్షకు సిద్దమని కాంగ్రెస్ ప్రకటించింది.

మరోవైపు తమ ఎమ్మెల్యేలను రక్షించే పనిలో పడింది కాంగ్రెస్,జేడీఎస్. బెంగళూరు నగర శివారులోని ఈగల్టన్‌ రిసార్టులో బస చేసిన జేడీఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించారు. ప్రత్యేక విమానంలో తరలించాలని భావించిన పౌరవిమానయాన శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో ప్లాన్ మార్చి హైదరాబాద్‌కు తరలించారు.

ముందుగా పార్క్‌ హయత్‌కు వెళ్లాలని భావించిన ఎమ్మెల్యేలు.. భద్రతా పరంగా అనుమానాలు వ్యక్తం కావడంలో ప్లాన్‌ మార్చుకున్నారు. దీంతో జేడీఎస్‌ ఎమ్మెల్యేలు నోవాటెల్‌ హోటల్‌కు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తాజ్‌కృష్ణకు చేరుకున్నారు. కర్ణాటక ఎమ్మెల్యేలు బస చేసిన హోటళ్ల‌ వద్ద హైదరాబాద్‌ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

- Advertisement -