ఆరు వికెట్ల తేడాతో భారత్‌ ఘనవిజయం

195
- Advertisement -

న్యూజీలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 191 పరుగులు విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా 33.1 ఓవర్లో లక్ష్యాన్ని చేదించింది. కోహ్లీ 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. లక్ష్య చేదనకు దిగిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ (14) ఆచితూచి ఆడగా, అజింక్యా రహానే (33) ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. పదో ఓవర్ లో 49 పరుగుల వద్ద అద్భుతమైన బంతికి రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. ఆ తరువాత రహనే కూడా నీషాం బౌలింగ్‌లో లూస్‌ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి 62 పరుగుల వద్ద వెనుదిరిగాడు.

స్కోరు 102 పరుగుల వద్ద హార్థీక్ పాండ్యా(17) సోధి బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కోహ్లీ కెప్టెన్‌ ధోనీతో కలిసి సంయమనంతో మరో వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడారు. ధోనీ అండతో ధాటిగా ఆడిన కోహ్లీ తన 55 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గెలుపుకు దగ్గరవుతున్న దశలో 29వ ఓవర్ నాలుగో బంతికి ఫీల్డర్ వద్దకు బంతికి తరలించిన కోహ్లీ, రన్ కాల్ ఇచ్చాడు. దీంతో ధోనీ క్రీజు మధ్యలోకి పరుగెత్తుకొచ్చాడు. మధ్యలోకి వచ్చిన తరువాత మళ్లీ వెనక్కి వెళ్లిపోమ్మని కోహ్లీ సూచించాడు. దీంతో ధోనీ వెనుదిరిగాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ధోనీ (21) 162 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ధోనీ తరువాత వచ్చిన జాదవ్తో కలిసి కోహ్లీ టార్గెట్ పూర్తి చేశాడు. కివీస్ బౌలర్లలో సోదీ,నషీం, బ్రాస్‌వెల్ తలో వికెట్ దక్కించుకున్నారు.

- Advertisement -