కర్నాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు యడ్యూరప్ప. గవర్నర్ వాజుభాయ్ ఉదయం 9 గంటలకు యడ్యూరప్ప చేత ప్రమాణస్వీకారం చేయించారు. మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన యడ్యూరప్ప బల ప్రదర్శన అనంతరం మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. పలువురు కేంద్రమంత్రులు యడ్యూరప్ప ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
లింగాయత్ లీడర్ అయిన యడ్యూరప్ప (74).. 2008లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన అవినీతి ఆరోపణలపై అధిష్ఠానం ఆయనపై వేటువేసింది. 2011లో సొంత పార్టీని స్థాపించిన యడ్యూరప్ప 2013 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన తిరిగి సొంత గూటికి చేరుకున్నారు.2018లో బీజేపీ మెజార్టీ స్ధానాలు దక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించారు.
ఇటు కాంగ్రెస్-జేడీ(ఎస్) పార్టీలు గవర్నర్‌ను కలిశాయి. తమకే మజార్టీ ఉందంటూ ఎవరికివారు నివేదిం చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకే అవకాశం ఇవ్వాలని కోరారు. రాజ్యాంగ నియమాలను పాటించి, సంపూర్ణ మెజార్టీ ఉన్న తమకే అవకాశం ఇవ్వండి అంటూ కాంగ్రెస్-జేడీ(ఎస్) గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాయి. కానీ గవర్నర్..అత్యధిక స్దానాలు సాధించిన బీజేపీకే అవకాశం ఇచ్చారు. 104 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలవగా… కాంగ్రెస్ 78, జేడీఎస్‌కు 38 సీట్లు ,ఇండిపెండెంట్లు రెండు స్ధానాల్లో విజయం సాధించారు.