నిన్న వెలువడిన కర్ణాటక ఫలితాల్లో రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఎ క్షణానికి ఏం జరుగుతుందో ఉహించడం కష్టంగా మారింది. కాంగ్రెస్, జేడీఎస్ లు ప్రభుత్వ ఎర్పాటుకు సన్నహాలు సిద్దం చేస్తుంది. బిజెపి తమకు సమయం కావాలంటూ గవర్నర్ ను కలిసింది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా నిలిచిన బజెపికి అధకారం ఇవ్వాలని గవర్నర్ ను కోరారు బిజెపి సీఎం అభ్యర్ధి యడ్యూరప్ప. ఈసందర్భంగా నేడు రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు బిజెఎల్పీ నేత యడ్యూరప్ప. యడ్యూరప్పను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నట్లు గవర్నర్ కు తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేల సంతాకాలతో కూడిన లేఖను గవర్నర్ కు అందజేశారు.
కర్ణాటకలో అతిపాద్ద పార్టీగా అవతరించిన తమకే ప్రభుత్వ ఏర్పాటకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ ను కోరారు బిజెపి నేతలు. యడ్యూరప్పతో పాటు గవర్నర్ ను కలవడానికి బిజెపి నేతలు సదానంద గౌడ, జెపి నడ్డా, జవదేకర్, ఈశ్వరప్ప, ఇతర నేతలు గవర్నర్ ను కలిశారు. ఇక కాంగ్రెస్ జేడీఎస్ నేతలు ప్రభుత్వ ఏర్పాటుపై సీఎల్పీ సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఇతర పార్టీలోకి జంప్ కాకుండా ఇరు పార్టీలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఎమ్మెల్యేలు రహస్యంగా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్డు మార్గానా కాకుండా హెలీకాప్టర్ దూరపు ప్రదేశాలకు తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కర్ణాటక భవితత్వం గవర్నర్ నిర్ణయంపై ఆధారపడి ఉంది.