18 న….’గీతా పురి కాలనీ’

223
geethapuri colony release on May 18th
- Advertisement -

నరేన్, శ్రవణ్, పార్థు, దుష్యంత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం `గీతాపురికాలనీ.` గర‌లకంఠ మ‌ద్దేటి శ్రీనివాస్ దర్శకుడు. జి.రామకృష్ణ నిర్మాత . రామ్‌చరణ్ స్వరాలను సమకూర్చిన ఈ చిత్ర గీతాలు ఇటీవల విడుదలై అలరిస్తున్నాయి . అన్ని కార్యాక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 18 న రిలీజ్ అవుతుంది. ఈ సందర్బంగా ఈ రోజు ఫిలిం ఛాంబర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం లో నిర్మాత జి.రామ కృష్ణ మాట్లాడుతూ…“ స్టోరీ బాగా నచ్చడం తో ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో నిర్మించాను. ఐదుగురు పిల్లల నేపధ్యం లో జరిగే స్టోరీ. ఇందులో మా అబ్బాయి కూడా ఒక రోల్ చేసాడు. విద్య యొక్క విలువ గురించి చెప్పే చిత్రమిది. ఈ నెల 18 న విడుదల చేస్తున్నాం. ఈ సినిమాకు కచ్చితము గా అవార్డ్స్ వస్తాయన్న నమ్మకం ఉంది“ అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ…“ఐదు కథల సమాహారంగాసాగే చిత్రమిది. తెరపై పాత్రలే తప్ప నటులు కనిపించరు. గీతాపురి కాలనీలో ఏం జరిగిందనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తిని కలిగిస్తుంది . మాకు సపోర్ట్ చేసిన రాంకీ గారికి ధన్యవాదాలు . పిల్లల సినిమాలు తక్కువై పోతున్న టైం లో ఇలాంటి బాలల సినిమా తీసాం. అవార్డ్స్ కోసం పంపిస్తున్నాం . ఈ నెల 18న రిలీజ్ చేసాం “ అన్నారు.

దుష్యంత్ కుమార్ మాట్లాడుతూ…. “పిల్లలలో చదువుకోవాలనే ఆసక్తి ఎలాంటి మలుపులు దారి తీసింది అనే కాన్సెప్ట్ తో సినిమా తీసాం. నేను కో ప్రొడ్యూసర్ గా చేస్తూ ఇందులో ఇంపార్టెంట్ రోల్ చేశాను “ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ చరణ్ మాట్లాడుతూ …“ఇందులో సిక్స్ సాంగ్స్ నేనే రాసి, కంపోజ్ చేశాను. పాటలకు రెస్పాన్స్ బావుంది“ అన్నారు.

న‌రేన్‌, శ్రావ‌ణ్‌, పార్ధు, శ్రీ హుత్, ప్ర‌జ్ఞ‌, దుష్యంత్ కుమార్ , ర‌మ‌ణి, శ్రీను కేస‌బోయిన‌, శ్రీహ‌రి, ప్ర‌తిమ‌, అంబిక‌, ముక్క‌రం, జ‌లాల్ మ‌హ్మ‌ద్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి మాటలుః నంద‌కిషోర్‌, కెమెరాః మ‌హేష్ మ‌ట్టి, ఎడిట‌ర్ః గోపి సిందం, ఆర్ట్ః పి.జీవ‌న్‌, కో-డైర‌క్ట‌ర్ః క‌త్తి. పోస్ట‌ర్ డిజైన్ః ధీర‌జ్ ఆర్ట్స్, పీఆర్వోః ర‌మేష్ చందు (బాక్సాఫీస్), నిర్మాతః జి. రామకృష్ణ , ద‌ర్శ‌క‌త్వంః గర‌లకంఠ మ‌ద్దేటి శ్రీనివాస్.

geethapuri colony release on May 18th

- Advertisement -