రైతుల ఆత్మబంధువు కేసీఆర్

238
ktr
- Advertisement -

దేశంలో సరికొత్త హరిత విప్లవానికి తెలంగాణ మార్గదర్శకం కానుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో రైతు బంధు కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్….రైతులకు సాగునీటితో పాటు పెట్టుబడి సాయం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

తెలంగాణలో కోటి ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని తెలిపారు.రైతు బంధు పథకం ద్వారా కేసీఆర్ రైతులకు ఆత్మ బంధువుగా మారారని కొనియాడారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేటీఆర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

రైతు సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేశారు. 86 ఏళ్ల తర్వాత భూ రికార్డుల ప్రక్షాళన చేసి 60 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్న నాయకుడు మన సీఎం అన్నారు. రైతు బంధు కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు విమర్శించడం సిగ్గు చేటన్నారు.

రాష్ట్రంలో ఉన్న 46 వేల చెరువులు నింపేందుకు మిషన్ కాకతీయ ద్వారా కృషి చేస్తున్నామన్నారు. రైతాంగానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని… తెలంగాణ ఏర్పాడ్డాక విత్తనాలు సరైన సమయానికి వస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బిడ్డ కాబట్టి రైతుల కోసం ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -