ప్రముఖ నిర్మాతలతో “బంగారి బాలరాజు” సాంగ్స్..

264
- Advertisement -

నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా పరిచయం చేస్తు కె.యండి. రఫీ. రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం “బంగారి బాలరాజు”. ఈ చిత్రం ఆడియోలోని మొదటి పాటను హీరో నందమూరి కళ్యాణ్ రామ్ విడుదల చేయగా, రెండవ పాటను ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర విడుదల చేశారు.
ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ… బంగారి బాలరాజు సినిమా ఆడియోలోని రెండవ పాటను నా చేతుల మీదుగా విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు దర్శకుడైన కోటేంద్ర చాలాకాలం మా టీంలో వర్క్ చేశాడు. తనకు సినిమా పట్ల ఉన్న ప్యాషన్ నాకు బాగా తెలుసు. కోటేంద్ర ఖచ్చితంగా ఈ సినిమాను సక్సెస్ చేస్తాడని అన్నారు. అలాగే ఈ సినిమా మంచి విజయం సాధించి ఈ బ్యానర్ మీద మరెన్నో సినిమాలు రావాలని, మూవీ టీంకు బెస్ట్ విషెష్ అందించారు.

Bangari Balaraju Movie Songs Launch

ఈ సందర్భంగా అశ్వనీదత్ మాట్లాడుతూ… బంగారి బాలరాజు సినిమా ఆడియోలోని అమ్మ మీద రాసిన పాటను విడుదల చేయడం జరిగింది. అంతా కొత్తవారితో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికి మంచిపేరు తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అని హీరో హీరోయిన్‌లకు మరియు మూవీ యూనిట్‌కు బెస్ట్ విషెస్ అందించారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ.. “బంగారి బాలరాజు ఆడియోలోని రెండవ పాటను అనిల్ సుంకర విడుదల చేయడం చాలా సంతోషం ఉంది. అనిల్ సర్ మా ఈ సినిమాకు అండగా ఉండడం కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఈ పాటను గీతామాధురి పాడగా, శాంతాబాయి సాంగ్ ఫేం మరాఠీ సెన్సేషనల్ హాట్ బ్యూటీ రాధికా పాటిల్ ఐటెంసాంగ్‌తో అలరించింది. అలాగే ఈ సందర్బంగా అనిల్ సర్‌కు యూనిట్ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు” అని తెలిపారు. ….అమ్మ ప్రేమను తెలియజేసే విధంగా రూపొందిన మూడవ పాట ను అశ్వనీదత్ విడుదల చేయడం హ్యాపీగా ఉంది. శ్రీ కృష్ణ పాడిన ఈ పాట తప్పకుండా అందరికి నచ్చుతుందని అన్నారు.

Bangari Balaraju Movie Songs Launch

ఈ సందర్భం గా నిర్మాత కె.యమ్ డి. రఫి మాట్లాడుతూ… ఈ సినిమా లోని స్పెషల్ సాంగ్ ను అనిల్ సుంకర మూడో పాటను అశ్వనీదత్ విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్బంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.

కెమెరా : చక్రవర్తి, ఆర్ట్ డైరెక్టర్ : కృష్ణమాయ, ఎడిటింగ్ : నందమూరి హరి, సంగీతం : చిన్నికృష్ణ – చిట్టిబాబు రెడ్డిపోగు, పాటలు : చిలకరెక్క గణేష్, ఫైట్స్ : రామ్ సుంకర, పి.అర్.ఓ : కడలి రాంబాబు. కేఎన్‌ఎస్‌ (కడలి మీడియా), నిర్మాతలు : కె.యండి. రఫీ, రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం :కోటేంద్ర దుద్యాల.

- Advertisement -