కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఆట ఆడకుంటున్నారు. రాహుల్ సారథ్యంలో కాంగ్రెస్ విజయవంతంగా మరో రాష్ట్రాన్ని కోల్పోయింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా జోకులు పేలుతున్నాయి. రాహుల్ ని కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించాలనే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో రాహుల్ కి బదులు ప్రియాంకకి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని కొందరు నేతలు సోనియాకు సూచించిన సంగతి తెలిసిందే.
రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాహుల్ కన్నడిగులను ఆకట్టులేక పోయారనే వార్తలు వినబడుతున్నాయి. ఈ కర్ణాటక ఎన్నికల ప్రభావం 2019 ఎన్నికలపై పడనుండడంతో రాహుల్ నాయకత్వంపై కాంగ్రెస్ నాయకులలో గుబులు పుట్టుకుంది.
https://twitter.com/erbmjha/status/996245986774212608
The state of Congress after another BJP victory. #KarnatakaVerdict pic.twitter.com/8jF9WoEkEd
— Pakchikpak Raja Babu (@HaramiParindey) May 15, 2018
Modi to Amit Shah. #KarnatakaVerdict pic.twitter.com/yoYcO6oBeH
— Sagar (@sagarcasm) May 15, 2018