సింగపూర్‎లో జేడీఎస్ నేత కుమారస్వామి…

260
JD(S) chief HD Kumaraswamy In Singapur
- Advertisement -

కన్నడనాట ఎన్నికల ఫలితాలు మరో 24 తేలనున్నాయి. కన్నడ పీఠం ఎవరు ఎక్కబోతున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏ పార్టీ ఎవరితో పొత్తుపెట్టుకుంటుంది. అనే వంటి పలు ఆసక్తికర విషయాలకు రేపటితో తేలనున్నాయి. రేపు వెలువడనున్న కర్ణాటక ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కర్ణాటకలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని తేలింది. ఒక వేళ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే, జేడీఎస్ కింగ్ మేకర్ గా మారనుంది. జేడీఎస్ ఏ పార్టీతో పొత్తుపెట్టుకుంటే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది. ఇదిలా ఉండగా జేడీఎస్ ముఖ్యనేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సింగపూర్ వెళ్లడంతో ఈ వార్త దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

JD(S) chief HD Kumaraswamy In Singapur

శనివారం పోలింగ్ ముగిసిన వెంటనే కుమారస్వామి సింగపూర్ వెళ్లిపోయారు. ఏ పార్టీతో పొత్తుపెట్టుకోవాలనే విషయంపై చర్చించేందుకే కుమారస్వామి సింగపూర్ వెళ్లారని కన్నాడనాట వార్తలు వినిపిస్తున్నాయి. సింగపూర్ నుంచే పార్టీ నేతలతో చర్చిస్తున్నారని అంటున్నారు. వారితో చర్చలు జరిపేందుకు కుమారస్వామి సింగపూర్ వెళ్లి ఉంటారు. ఇక్కడే ఉంటే మీడియాకు తెలిసే అవకాశముందని కదా అంటూ ఆయన సన్నిహితుడొకరు చేసి వ్యాఖ్యలు ఆ వార్తలకు ఆజ్యం పోసినట్టైంది. అయితే జేడీఎస్ పార్టీ వర్గాలు మాత్రం వైద్య పరీక్షల నిమిత్తం కుమారస్వామి సింగపూర్ వెళ్లారని చెబుతున్నాయి. ఈ రోజు సాయంత్రానికి బెంగళూరు చేరుకుంటారని పేర్కొన్నాయి.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందితే.. జేడీఎస్ తో పొత్తుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పర్చే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం సిద్దరామయ్య ముఖ్యమంత్రి పీఠాన్ని త్యాగం చేసేందుకు సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే. దళితుడికి సీఎం పీఠం అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ కాంగ్రెస్‌ జేడీఎస్‌ మద్దతు తీసుకుంటే.. సిద్దరాయమ్య కాకుండా దళిత సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గే లేదా మరో దళిత నేత సీఎం అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

బీజేపీలోనే దళిత సీఎం గళం వినిపిస్తోంది. అయితే ఇప్పటికే సీఎం అభ్యర్థిగా ఉన్న యడ్యూరప్పను కాదని దళిత నేతను బీజేపీ అధిష్టానం సీఎంగా నియమిస్తుందా..? లేదా అనేది మాత్రం జేడీఎస్ చేసే బేరసారాలను బట్టి ఆ పార్టీ నిర్ణయం తీసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -