- Advertisement -
అల్లు అర్జున్ అభిమాని దేశసాయి గణేశ్ అనాగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే గత కొంత కాలంగా బోన్ కేన్సర్ తో బాధపడుతున్న దేవసాయి గణేశ్ మృతి చెందాడు. అభిమాని చనిపోయాడని తెలుసుకున్న అల్లు అర్జున్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సాయి గణేశ్ మరణ వార్త విని నా గుండె పగిలిపోయింది. అతని కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా సానుభూతి అంటూ బన్నీ ట్వీట్టర్ లో ఆవేదన వ్యక్తం చేశాడు.
బోన్ కేన్సర్ తో బాధపడుతన్న దేవసాయి గణేష్ ని వైద్యులు చివరి కోరిక అడగగా.. తనకు అల్లు అర్జున్ అంటే ఇష్టమని, తనను ఒక్కసారి చూడాలని కోరాడు. ఈ విషయం తెలుసుకున్న బన్నీ విశాఖపట్నంలోని అనకాపల్లిలోని దేవసాయి ఇంటికి వెళ్లి అతనికి ధైర్యం చెప్పొచ్చిన సంగతి తెలిసిందే.
- Advertisement -