విశాల్ హీరోగా సమంత హీరోయిన్గా తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుంబుతిరై’. ఈ సినిమా (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో ఆధార్ కార్డు గురించి ప్రస్తావన, కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా పథకాన్ని విమర్శించడం వంటివి ఉండటంతో ఈ సినిమా వివాదాల్లో చిక్కకుంది.
ఈ సినిమాలో వాటి ప్రస్థావన ఉండటంతో హిందు సంస్థలు భగ్గుమంటున్నాయి. దీంతో ఈ చిత్రాన్ని ఆపాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్ కూడ దాఖలైంది. ఆ పటిషన్‌ను కోర్టు తోసిపుచ్చడంతో హిందు సంస్థలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో విశాల్ ఇంటిని హిందు సంస్థలు ముట్టడించే ప్రయత్నాల్లో ఉన్నాయట. అందుకు విశాల్ ఇంటి వద్ద భారీ భద్రతను కట్టుదిట్టం చేసినట్లు సమాచారం. ఈ సినిమా (శుక్రవారం) విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాకు మిత్రన్ దర్శకత్వం వహించగా విశాల్ ఫిలిం ఫ్యాక్టరి బ్యానరుపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో యాక్షన్ హీరో అర్జున్ కీలక పాత్రలో నటించారు.