కోడి మాంసం ధరలకు రెక్కలొచ్చాయి. ఇటీవల కాలంలోని పరిస్థితుల వల్ల చికెన్ ధరలు అమాంతం పెరిగిపోవడంతో మాంస ప్రియులు షాక్‌కు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల మాంసం కొనాలంటే మాంస ప్రియులు వెనకడుగు వేస్తున్నారు. వాతావరణంలో అనుకోని మార్పులు చోటు చేసుకోవడంతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.
దీంతో చెకెన్ ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. దీనికి పెళ్లిళ్ల సీజన్ తోడవటంతో కోడి మాంసానికి డిమాండ్ భారీగా పెరిగింది. సండే వచ్చిందంటే చాలు హాయిగా చికెన్ తినియోచ్చన్న ఆశలపై పెరిగిన చికెన్ ధరలు నీళ్లు చల్లుతున్నాయి. గత పదిహేను రోజుల నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవటంతో సుమారు 15 శాతం కోళ్లు పౌల్ట్రీలలోనే మృతి చెందుతున్నట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి.
గత పదిహేను రోజుల క్రితం కిలో చికెన్ ధర. రూ. 160 ఉండగా ఇప్పుడు మాత్రం ఏకంగా రూ.220లకు ఎగబాకింది. ఈ ధరల వల్ల చికెన్ షాపులు గిరాకీ లేక వెలవెల బోతున్నాయి. ఇలాంటి ధరలను చూసి చికెన్ కొనే వాళ్లు ఆలోచించాల్సిన పరిస్థితులు దాపరించాయి. కాగా రానున్నది రంజాన్ మాసం కావడంతో కొడి మాంసానికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. భగ్గుమంటున్న ఈ ధరలను చూసి చికెన్ ప్రియలు ఇతర వంటకాలతో సరిపెట్టుకోవాల్సి పరిస్థితి వచ్చింది. రంజాన్ మాసంలో చికెన్ ధరలు ఇంకేంత పెరుగుతాయి చూడాలి మరి..!