పండుగ వాతావరణంలో చెక్కుల పంపిణీ…

378
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా రైతు బంధు పథకం దిగ్విజయంగా సాగుతోంది. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పట్టాదారు పాస్‌ పుస్తకాలు, చెక్కులను పంపిణీ చేస్తున్నారు అధికారులు. పలు జిల్లాల్లో మంత్రులు,ఎమ్మెల్యేలు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాలను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. రైతు సంక్షేమానికే సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని…రైతుల కోసం ఎన్నో పథకాలు తెస్తుంటే..కాంగ్రెస్ నేతలు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డరు. ప్రతీ రైతుకు రైతుబంధు చెక్కులను అందిస్తామన్నరు హరీష్ రావు.

వరంగల్ జిల్లాలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రామానుజపురంలో రైతు బంధు కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. తెలంగాణ రాకముందు వ్యవసాయం ఎలా ఉండేదో గుర్తు చేసుకుంటే.. కరెంట్ రాక, విత్తనాలు, ఎరువులు దొరకక, పొలాలు ఎండిపోయి రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. ఎరువులు, విత్తనాల కోసం క్యూలో నిలబడి, చెప్పులు క్యూలో పెట్టే పరిస్థితి ఉండేదని కానీ నేడు ఆ పరిస్ధితి మారి రైతే రాజు అయ్యేలా వ్యవసాయానికి ప్రభుత్వం సాయం అందిస్తోందన్నారు.

kadiyam cheques

సీమాంధ్ర ప్రభుత్వాలు తెలంగాణను చీకటిమయం చేస్తే..టీఆర్ఎస్ ప్రభుత్వం వెలుగుల తెలంగాణగా మార్చిందన్నారు మంత్ర ఈటల రాజేందర్. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని అందుకే రైతును ఆదుకునేందుకు రైతు బంధు పథకాన్ని ప్రారంభించారన్నారు. ఈ పథకం ద్వారా అన్నదాతలకు 12వేల కోట్ల రూపాయలను అందిస్తున్నామని తెలిపారు.17వేల కోట్ల రైతు రుణం మాఫీ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సాయం చేయాలని కోరినా కనికరించలేదన్నారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రుల పోచారం, తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. రైతులకు ఎకరానికి 4 వేల రుపాయలు ఇచ్చి… వ్యవసాయానికి పూర్వ వైభవం తీసుకువస్తున్నరన్నారు. రైతుబంధు పథకం దేశానికే దశదిశ చూపిస్తుందని మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అన్నరు.

Image result for harish rao  etela rajender rythu  bandhu

- Advertisement -