ఆదా శర్మకు ఈ మద్య కాలంలో సినిమా అవకాశాలు పెద్దగా లేవనే చెప్పాలి. కానీ ఈ అమ్మడి అందాల ఆరబోతకు ఏ మాత్రం కొదవలేదు. ఎంచక్కా ఫోటోలు తీసుకోవడం హాట్ హాట్ గా వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది ఈ హాట్ బ్యూటీ. గతేడాది కమాండో 2 సినిమా విడుదలయ్యాక అమ్మడికి పని లేకుండా పోయింది. ప్రస్తుతం ఏ సినిమాలోనూ నటిస్తున్న సమాచారం లేదు. అందుకే ఇన్ స్టాగ్రామ్ లు యువత మతి చెడగొట్టేలా డ్యాన్సు చేస్తూ వీడియోలు పెడుతోంది.
అమాయకపు ముఖంతో ఉంటుంది కానీ ఈ చేసే రచ్చ అంతాఇంతా కాదు. అయితే ఇంతవరకు ఏ భాషలోనూ ఆమెకు మంచి బ్రేక్ రాలేదు. చివరికి చిన్న చిన్న పాత్రలు సెకండ్ హీరోయిన్ పాత్రలు చేసేందుకు సిద్ధపడింది. దీంతో తెలుగులో మెయిన్ హీరోయిన్ గా తీసుకునేందుకు దర్శక నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నారు. తెలుగులో రెండేళ్ల క్రితం వచ్చిన క్షణం సినిమా తరువాత ఆమె మళ్లీ కనిపించింది లేదు.
తెరమీద కనిపించకపోయినా అభిమానులకు అందాల విందు చేస్తూనే ఉంది ఈ అందాల ఆదా. బ్యాక్లెస్ టాప్లు పొట్టి నిక్కర్లు వేసుకుని ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు పెడుతూనే ఉంది. అదాకు ఇష్టమైన వ్యాపకం డ్యాన్సు. అందులోనూ కురచ దుస్తులు వేసుకుని చిందులేయడమంటే మరీ ఇష్టం. మీలో ఎవరికి డ్యాన్సంటే ఇష్టమో వారిని ట్యాగ్ చేయండి అని ఓ కామెంట్ పడేసి… తాను చేసిన డ్యాన్సు వీడియోను అప్ లోడ్ చేస్తుంది.
https://youtu.be/8NyO5MU5UxM