ప్రభుదేవాను పెళ్లిచేసుకోవడానికి రెడీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది నటి నికీషా పటెల్. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన ఆమెకు ఇప్పటి వరకు సరైన హిట్ రాకపోవడంతో అవకాశాల కోసం దారులు వెతుకుతుంది. తెలుగు తెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నికీషా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ‘పులి’ అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా విజయం సాధించకపోవడంతో ఈ అమ్మడుకు నటిగా పెద్దగా గుర్తింపు రాలేదు.
దీంతో తమిళ సినీ పరిశ్రమ వైపు కన్నేసింది. అక్కడ ఎన్నమో ఏదో, కరైయోరం, నాదన్ వంటి చిత్రాల్లో నటించిన అవి కూడా విజయాన్ని అందుకోలేక పోయాయి. ప్రస్తుతం కోలీవుడ్‌లో పాండిముని సినిమాలో నటించే అవకాశాన్ని అందుపుచ్చుకుంది ఈ బ్యూటీ. అయితే ఈ చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.
ప్రభుదేవా గురించి మాట్లాడుతూ..నన్ను అందరు ఏ హీరో నటన అంటే ఇష్టమని అడుగుతున్నారు అందులో నాకు ప్రభుదేవా నటన అంటే ఇష్టమని, ఆయనతో పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అంటూ తెలిపింది నికీషా పటేల్. ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్‌గా నిలిచి వైరల్‌గా మారింది. గతంలో ప్రభుదేవా, నయనతార వివాహం చేసుకోవాలనుకున్న అది పెళ్లి వరకు రాలేపోయిన విషయం తెలిసిందే. ఇక కాస్టింగ్ కౌచ్ వ్యవహారం కూడా స్పందిస్తూ సినిమా అవకాశాల కోసం పడకగదికి రమ్మంటున్నారన్న విషయాన్ని నేను ఎప్పుడో చెప్పానని, ఇది ఒక సిినిమా రంగానికి మాత్రమే పరిమితంకాదని అన్ని రంగాల్లో ఉందని ఆమె చెప్పుకొచ్చారు.